“ఆకాశమే నీ హద్దురా” క్లైమాక్స్ లోని ఈ లేడీ పైలట్ రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

“ఆకాశమే నీ హద్దురా” క్లైమాక్స్ లోని ఈ లేడీ పైలట్ రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

by Mohana Priya

Ads

ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినా, సూర్య సినిమా కాబట్టి, సూర్య ఎన్నో సంవత్సరాల నుండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయారు కాబట్టి ఇది మన తెలుగు సినిమానే. ఒక నిజ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీ రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

Video Advertisement

ఈ సినిమాకి సూర్య పర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా హీరోయిన్ గా అపర్ణ బాలమురళి, అలాగే ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, పరేష్ రావల్ కూడా చాలా బాగా నటించారు. మోహన్ బాబు కూడా అతిధి పాత్రలో కనిపించారు. ఈ సినిమా జీ ఆర్ గోపీనాథ్ ఆటో బయోగ్రఫీ సింప్లీ ఫ్లై ఆధారంగా రూపొందించారు.

సినిమాలోని సంఘటనలు నిజజీవితంలో జరిగినవి కాబట్టి కొంత మంది ప్రముఖుల పాత్రలు కూడా పేర్లు మార్చి మనకి చూపించారు. అంటే విజయ్ మాల్యా పేరు బాలయ్య, నరేష్ గోయల్ పేరు పరేష్ గోస్వామి గా అన్నమాట. అలాగే ఉడుమలైపేట్టై కి చెందిన షేక్ మొహిదీన్ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పాత్రలో కనిపించారు. ఆయనని ఉడుమలై కలాం అని అంటారు.

సినిమా చివరిలో ఒక లేడీ పైలెట్ ఫ్లైట్ లో నుండి బయటికి వస్తూ ఉంటారు. తనని చూసి హీరో తల్లి పాత్ర పోషించిన ఊర్వశి “ఫ్లైట్ నడిపింది ఈ అమ్మాయేనా?” అని ఆశ్చర్యంగా అడుగుతారు. సినిమా విడుదలైన తర్వాత “ఆ పైలెట్ పాత్రలో నటించిన ఆవిడ ఎవరు?” అని అని మీలో కొంత మంది అయినా అనుకొనే ఉంటారు.

తన పేరు వర్ష నాయర్. నిజజీవితంలో కూడా వర్ష ఒక పైలెట్. చెన్నైకి చెందిన వర్ష ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలెట్ గా ఉద్యోగం చేస్తున్నారు. వర్ష భర్త లోకేష్ కూడా ఎయిర్ ఇండియాలో పైలెట్ గా చేస్తున్నారు. వర్ష ని ఈ సినిమా దర్శకురాలు సుధ కొంగర సంప్రదించిన తర్వాత వర్ష ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించారు.

 

 


End of Article

You may also like