సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
Video Advertisement
ఈ సినిమా లో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య లీడ్ రోల్ చేస్తున్న ఏ సినిమా అయినా వన్ మాన్ షో అయిపోతుంది. అఖండ విషయంలో కూడా అదే నిజమైంది.
ఈ సినిమాలో బేబీ దేష్ణ కూడా కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ కూతురుగా నటించిన ఆమెకు కూడా చాలా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఎవరు..? ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది అన్న విషయమై సోషల్ మీడియా లో చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో ఆమె తల్లి తండ్రులు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ లో బేబీ దేష్ణకు ఈ అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. బేబీ దేష్ణను ఇన్స్టా లో చూసిన సినిమా నిర్మాతలు తమను అప్రోచ్ అయ్యారని వివరించారు. బేబీ దేష్ణకు మొదటి అవకాశమే మంచి సినిమా వచ్చిందని.. ఈ సినిమా బేబీ దేష్ణకు పేరు తెచ్చి పెట్టిందని సంతోషం వ్యక్తం చేసారు. బాలయ్య బాబు కూడా బేబీ దేష్ణతో ఎంతో ఫ్రెండ్లీ గా ఉన్నారని చెప్పుకొచ్చారు.
దేష్ణ నటనని చూసి బాలయ్య మెచ్చుకునేవారని.. దేష్ణ కూడా సీన్ అవ్వగానే వెంటనే మోనిటర్ లో తనని చూసుకుని మురిసిపోయేదని చెప్పుకొచ్చారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటికి ధన్యవాదాలు కూడా తెలిపారు. షూటింగ్ సమయంలో కూడా అందరు తమను కుటుంబ సభ్యులలాగా చేసుకున్నట్లు చెప్పారు.