Ads
- చిత్రం : అఖండ
- నటీనటులు : బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, జగపతి బాబు.
- నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి
- దర్శకత్వం : బోయపాటి శ్రీను
- సంగీతం : తమన్
- విడుదల తేదీ : డిసెంబర్ 2, 2021
స్టోరీ :
Video Advertisement
సినిమా మొదట్లోనే కవలలు పుట్టడం చూపిస్తారు. కొద్ది సంవత్సరాల తర్వాత మురళీ కృష్ణ (బాలకృష్ణ) ఎంట్రీ ఇస్తారు. తాను ఉండే అనంతపురంలో చాలా మందిని ఫ్యాక్షనిజం మానిపించి మంచి దారి చూపిస్తాడు. అలాగే అక్కడ ఎటువంటి చెడు జరగకుండా మురళీ కృష్ణ కృషి చేస్తూ ఉంటాడు. శరణ్య (ప్రగ్యా జైస్వాల్) ఆ ఊరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో మురళీ కృష్ణ చేసే మంచి పనులు చూసి శరణ్య అతనిని ఇష్టపడుతుంది. ఆ ఊర్లో అక్రమ మైనింగ్ పనులు చేసే వరదరాజులు (శ్రీకాంత్)కి, మురళీ కృష్ణకి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత అఖండ (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. అఖండకి, వరదరాజులుకి మధ్య గొడవ మొదలవుతుంది. మురళీ కృష్ణ వరదరాజులుని ఎలా ఎదుర్కొన్నాడు? అఖండ వరదరాజులుని అడ్డుకోవడానికి ఏం చేశాడు? అసలు చిన్నప్పుడు మురళీ కృష్ణ, అఖండ ఎందుకు విడిపోయారు? తర్వాత వారిద్దరూ ఎలా కలిశారు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెర మీద హైలెట్ బాలకృష్ణ అయితే, తెర వెనకాల హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది. అందులోనూ ముఖ్యంగా ఫైటింగ్ సమయంలో వచ్చే మ్యూజిక్ అయితే ఆ సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేసింది.
నెగిటివ్ పాత్రలో శ్రీకాంత్ కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను విషయానికొస్తే, కథ మనం అంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ బోయపాటి శ్రీను ప్రజెంట్ చేసే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంది. ప్రేక్షకులు బాలకృష్ణని ఎలా అయితే చూడాలి అనుకున్నారో బోయపాటి శ్రీను అలాగే అంచనాలకు తగ్గకుండా తెరపైన చూపించారు. బాలకృష్ణని తెరపై ఇంత పవర్ ఫుల్ రోల్ లో చూసి చాలా రోజులు అయ్యిందేమో అని అనిపిస్తుంది. ఫైటింగ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- బాలకృష్ణ
- తమన్ మ్యూజిక్
- ఫైట్స్
మైనస్ పాయింట్స్:
- కథలో లోపించిన కొత్తదనం.
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కొత్త స్టోరీ చూడాలి, అందులో ట్విస్ట్ లు ఉండాలి, అనే విషయాలన్నిటినీ పక్కనపెట్టి, ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలి, బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక ప్రేక్షకుడిని అఖండ కచ్చితంగా నిరాశపరచదు.
Also Read: బాలకృష్ణ “అఖండ” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!
End of Article