అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ చిత్రం తాజాగా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి రిలీజ్ అయిన తొలిరోజు నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

ఇది ఇలా ఉంటే అఖిల్ తరువాత చేయబోయే సినిమా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ప్రభాస్ కోసం సిద్ధం చేసిన కథలో అఖిల్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అక్కినేని అఖిల్ ఏప్రిల్ 28 న ఏజెంట్ చిత్రం ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మూవీ పై తీవ్రంగా  ట్రోల్ చేస్తున్నారు. కాగా అఖిల్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతుందంట. ఈ చిత్రం ద్వారా అనీల్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న అనీల్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒక స్టోరీ చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అనీల్ సాహో, రాదేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో పని చేశాడు. సాహో సమయంలోనే యూవీ ప్రొడ్యూసర్లకు ఒక ఐడియా చెప్పడం, వాళ్ళు ఒకే అనడం జరిగిందంట.
ఆ స్టోరీని ప్రభాస్ తో చేయాలని నిర్మాతలు భావించారంట. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫలితాల కారణంగా అనీల్  చెప్పిన స్టోరీ ప్రభాస్ తో చేయడం సరి కాదని భావించి, అఖిల్ తో ఆ మూవీ చేయనున్నారని టాక్. ప్రభాస్ కోసం తయారుచేసిన స్టోరీతోనే అనీల్ హీరో అఖిల్ తో మూవీ చేస్తున్నాడా ? లేదా వేరే కథతో చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. యంగ్ హీరో అఖిల్ మంచి హిట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్’ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో తదుపరి చేయబోయే చిత్రం విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండనున్నట్టు  తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో అయినా అఖిల్ కు హిట్ వస్తుందని యూవీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారంట.

Also Read: అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?