అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

Ads

అఖిల్ అక్కినేని హీరోగా ఇటీవల విడుదల అయిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ కేవలం తెలుగు మలయాళం భాషల్లో మాత్రమే విడుదల చేశారు.

Video Advertisement

మలయాళంలో కూడా విడుదల చేయడానికి కారణం ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొంత మంది సినిమా బాగుంది అంటే, మరి కొంతమంది మాత్రం సినిమాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

agent movie review

ఆ ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళింది అంటే అసలు ఈ విషయాలపై ఎప్పుడూ మాట్లాడని అఖిల్ తల్లి అమల అక్కినేని కూడా ఈ విషయంపై స్పందించి ఇలా చేయడం తప్పు అని మాట్లాడారు. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా, సినిమాలో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి అని కొంత మంది అంటున్నారు. మరి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 మొదటి విషయం సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమాకి పెట్టిన ఖర్చు అంతా కూడా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయంలో తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. లొకేషన్స్ కూడా గ్రాఫిక్స్ వాడకుండా ఎక్కువగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయడంతో ఒక మంచి యాక్షన్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది.

కానీ కథనం విషయంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. అలాంటి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు మనం ఇంతకుముందు చాలా చూసాం. కొత్తగా చూపించాలని ప్రయత్నం చేశారు కానీ అవి పేక్షకులని కొంతవరకు నిరాశపరిచాయి. దాంతో చాలా మంది, “స్టోరీ లైన్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో” అని అన్నారు.

agent movie review

#2 సినిమాకి ప్లస్ అయినా మైనస్ అయినా కూడా ప్రేక్షకులు ఎక్కువగా చూసేది హీరో పాత్రని రాసిన విధానం. హీరో పాత్ర పాజిటివ్ గా లేకపోయినా కూడా కొత్తగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు. కానీ అలా కొత్తదనం గురించి ఆలోచిస్తూ కొన్ని సినిమాల్లో కొంత మంది హీరోల పాత్రలు కొంచెం అతిగా ప్రవర్తించేలాగా ఉంటున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్ర అలాగే ఉంది. అఖిల్ అక్కినేని ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం అభినందించాల్సిన విషయం. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం ఓవర్ గా అనిపించింది అనే కామెంట్స్ వచ్చాయి.

minus points in agent movie

#3 సినిమా పాటలు బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే అంటూ ఉంటారు. కానీ ఈ సినిమాకి పాటలు మాత్రం చాలా పెద్ద మైనస్ అయ్యాయి. పాటలు విడుదల అయినప్పుడు వినడానికి బానే ఉన్నాయి అనుకున్నారు. కానీ అవి సినిమాలో చూస్తూ ఉంటే అసలు సినిమా ఫ్లోని అవి డిస్టర్బ్ చేసే లాగా ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక యాక్షన్ సీన్ నడుస్తూ ఉంటే అదేదో ఎమోషనల్ సీన్ కి వచ్చిన మ్యూజిక్ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే సినిమా ఇంకా కొంచెం బాగుండేది ఏమో అని అన్నారు.

agent movie review

#4 సినిమాలో హీరో పాత్రని రాసుకున్న అంత బలంగా విలన్ పాత్ర కూడా రాసుకొని ఉంటే చాలా వరకు సినిమాలో ప్రేక్షకులకి నచ్చుతాయి. అందుకు ఒక ఉదాహరణ ధ్రువ సినిమా. ఈ సినిమాలో చాలా చోట్ల హీరో కంటే చాలా ఎక్కువ స్మార్ట్ గా విలన్ ఆలోచిస్తాడు. కానీ అలా అని హీరో తగ్గిపోలేదు. ఇలాంటి యాక్షన్ సినిమాలకి విలన్ పాత్ర చాలా బాగుండడం కూడా ముఖ్యమైన విషయం.

కానీ ఇలాంటి సినిమాలో కూడా విలన్ పాత్ర ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టు, హీరోకి వార్నింగ్ ఇస్తూ, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు అంతే. విలన్ పాత్ర పోషించిన నటుడు బాగా చేశాడు. అసలు అతనికి ఇండియా మీద ఎందుకు అంత కోపం అనే పాయింట్ ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది.

minus points in agent movie

#5 సినిమాకి కాస్టింగ్ కూడా చాలా ముఖ్యమైన విషయం. కొంత మంది పాత్రలు బాగానే ఉన్నా కూడా, కొంత మంది ముఖ్యమైన పాత్రలు ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ సాక్షి వైద్య అయితే లిప్ మూమెంట్ ఒకటి వస్తూ ఉంటే తను మాట్లాడేది ఒక డైలాగ్ ఉంటుంది. ఇది ఒకటి రెండు చోట్ల కాదు. చాలా చోట్ల జరిగింది. దాంతో చాలా మంది, “హీరోయిన్ పాత్రకి వేరే ఇంకా ఎవరిని అయినా తీసుకొని ఉంటే బాగుండేది ఏమో” అని అన్నారు.

minus points in agent movie

ప్రస్తుతం అయితే ఏజెంట్ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది చాలా రొటీన్ సినిమా అంటే, మరి కొంత మంది మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది అని అంటున్నారు. కొంత మంది అఖిల్ అక్కినేని, మమ్ముట్టి పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు.

ALSO READ : “వాల్తేరు వీరయ్య” నుండి… “విరూపాక్ష” వరకు… 2023 లో ఇప్పటివరకు “హిట్” టాక్ తెచ్చుకున్న 10 సినిమాలు..!


End of Article

You may also like