“వాల్తేరు వీరయ్య” నుండి… “విరూపాక్ష” వరకు… 2023 లో ఇప్పటివరకు “హిట్” టాక్ తెచ్చుకున్న 10 సినిమాలు..!

“వాల్తేరు వీరయ్య” నుండి… “విరూపాక్ష” వరకు… 2023 లో ఇప్పటివరకు “హిట్” టాక్ తెచ్చుకున్న 10 సినిమాలు..!

by kavitha

Ads

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 5 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి.

Video Advertisement

కరోనా తరువాత ఇతర ఇండస్ట్రీల కన్నా ఆడియెన్స్ ని ఎక్కువగా థియేటర్‌లకు రప్పించిన ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది. మరి ఈ ఏడాది ఇప్పటివరకు విజయం సాధించిన సినిమాలు ఏమిటో ఇపుడు చూద్దాం..
1. వాల్తేరు వీరయ్య:
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ ర‌వితేజ హీరోలుగా వచ్చిన వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతికి విడుదలై 230 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వసూల్ చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు.
waltair veerayya run time locked..this is plus or minus..??2. వీర సింహ రెడ్డి:
నందమూరి బాలకృష్ణ నటించిన వీర‌సింహారెడ్డి సంక్రాంతికి విడుదలై వంద కోట్ల‌కు పైగా వసూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రం బాల‌య్య కెరీర్‌లో అత్య‌ధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేశారు. ఈ మూవీలో శృతి హాసన్, హానీరోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
3. వారసుడు:
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అవగా, తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.
4. సార్:
కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన మొదటి తెలుగు చిత్రం సార్.సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. మొదటి చిత్రంతోనే ధనుష్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఆయన రాసిన డైలాగ్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. 2023లో రిలీజ్ అయిన టాప్ గ్రాసర్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 5. రైటర్ పద్మభూషణ్:
సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. విడుదలకి వారం రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కు అధికంగా వసూళ్ల రూపంలో వచ్చింది.
writer padmabhushan movie OTT release date fix..!!6. వినరో భాగ్యము విష్ణు కథ:
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. వరుస ప్లాప్ ల తరువాత కిరణ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా10 కోట్ల పైనే వసూల్ చేసింది.
7. బలగం
కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మరి తీసిన మొదటి చిత్రం ‘బలగం.చిన్న సినిమాగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని చాలా సహజంగా తెరకెక్కించి వేణు అందరిని ఆశ్చర్యపరిచారు. ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత కూడా జనాలు థియేటర్లకి వెళ్ళి చూసారంటే ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
balagam-movie-watched-the-entire-village-people28. దాస్ కా ధమ్కి:
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్‌ సినిమా దాస్ కా ధమ్కి. ఇక ఈచిత్రానికి విశ్వక్ సేన్ డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
9. దసరా:
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా చిత్రం విడుదలై నెల రోజులు కావొస్తున్నా ఇంకా బీ, సీ సెంటర్‌లలో సందడి చేస్తోంది.థియేటర్‌లలో టిక్కెట్‌లు భారీ సంఖ్యలో సేల్ అవుతున్నాయి. వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఎన్నో సంవత్సరలుగా కమర్షియల్‌ గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్న హీరో నానికి దసరా కమర్షియల్ విజయాన్నే ఇచ్చింది.
dasara movie review10. విరూపాక్ష:
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను వసూల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.

Also Read: “ఏజెంట్” VS “పొన్నియన్ సెల్వన్ 2”..! ఈ 2 సినిమాలలో కలెక్షన్స్ దేనికి ఎక్కువ వచ్చాయి అంటే..?


End of Article

You may also like