తెలుగు సినిమా చరిత్రలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తుండి పోతారు. కొన్ని దశాబ్దాల క్రితం తెలుగులో అక్కినేని ఫ్యాన్స్ లక్షల్లో ఉండేవారు. ఎయన్నార్ మరియు నాగార్జునలకు అభిమానులు జాతీయ స్థాయిలో ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.
Video Advertisement
అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నారు. ఈ విషయం అక్కినేని ఫ్యామిలీ కూడా గుర్తించింది. కాని ఏం చేయాలో వారికి కూడా పాలుపోవడం లేదు. ఈ నేపథ్యం లో గతం లో అక్కినేని అభిమానులు ఒక లేఖ రాసారు. ఆ లెటర్ అక్కినేని ఫ్యాన్స్ పడుతున్న ఇబ్బందులకు అద్దం పట్టే విధంగా ఉంది.
ఆ లెటర్‌లో… “అక్కినేని ఫ్యాన్స్ కొన్నాళ్ల క్రితం లక్షల్లో ఉండేవారు, కాని ఇప్పుడు వేలల్లోకి పడిపోయారు. ఇందుకు కారణం తాతగారు ఎయన్నార్ లేదా నాన్న గారు నాగార్జున, అన్న గారు నాగచైతన్య లేదా మీరో కాదు. మీ పక్కన ఉండే వర్కర్స్. మీరు ఎంతగా అభిమానులను అభిమానిస్తారో మాకు తెలుసు. కాని మీ పక్కన ఉన్న వారు మీకు తెలియకుండానే మీ అభిమానులమైన మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు.
పలు సందర్బాల్లో మీ దగ్గర వర్క్ చేసే వారు అక్కినేని ఫ్యాన్స్ అంటూ వచ్చిన వారిని చాలా దారుణంగా అవమానించి, బయటకు నెట్టేశారు. మీ పక్కన ఉన్న వారి అభిప్రాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు వేల మంది మాత్రమే అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు. అఖిల్ సినిమా ఉత్తరాంధ్రలో 100కు పైగా థియేటర్లలో విడుదల చేస్తే, మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి వేరే సినిమా కోసం ‘హలో’ను 50 థియేటర్లలో మాత్రమే విడుదల చేశారు.
అదేంటి అంటే మా ఇష్టం, హైదరాబాద్ వారిని అడగండి అంటున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే వేలల్లో ఉన్న అక్కినేని అభిమానులు వందల్లోకి వస్తారనే భయంగా ఉంది..” అంటూ వైజాగ్ అక్కినేని ఫ్యాన్స్ అఖిల్‌ను ఉద్దేశించి లేఖ రాసారు. ఇలా హలో మూవీ ఆడియో ఫంక్షన్ లో అఖిల్ వ్యక్తిగత సిబ్బంది అభిమానులతో వ్యవహరించిన తీరు తో నొచ్చుకున్న అక్కినేని అభిమానులు తమ ఆవేదనను తెలుపుతూ అఖిల్ కి లేఖ రాసారు.