చిన్నప్పుడే అల్లు అర్జున్ కమల్ హాసన్ తో కలిసి నటించాడని తెలుసా..? ఏ సినిమాలో అంటే?

చిన్నప్పుడే అల్లు అర్జున్ కమల్ హాసన్ తో కలిసి నటించాడని తెలుసా..? ఏ సినిమాలో అంటే?

by Anudeep

Ads

గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఎలా అవుతాడు? అని అందరు అనుకున్నారు. కానీ.. ఆ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో హీరో అయిపోయాడు. ఇప్పటికే విడుదల అయిన పుష్ప పార్ట్ వన్ సినిమాతో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. తెలుగు నాట మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కు కేరళలో కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

ఇక పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే ఆ సినిమాతో కూడా అల్లు అర్జున్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే హీరో గా పరిచయం కాకముందే అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసాడు.

మెగాస్టార్ నటించిన సినిమాల్లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ చిన్న వయసులో ఉన్నప్పుడే కమల్ హాసన్ సినిమాలో నటించారని తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఎంత విభిన్నమైన నటుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో నటించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే.. అల్లు అర్జున్ చిన్న వయసులోనే ఆ ఛాన్స్ కొట్టేసాడన్నమాట.

allu arjun

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ ని అమాయకుడిగా చూపిస్తారు. ఓ అమాయకుడిగా కమల్ హాసన్ నటనని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినిమా స్టార్టింగ్ లో కమల్ హాసన్ ఓ తాతలా కనిపిస్తారు. కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ కనిపిస్తారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న టైములో షూటింగ్ స్పాట్ కి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అయితే చిన్నపిల్లాడిగా ఉన్న అల్లు అర్జున్ ని చూసి ఓ పాత్ర కోసం అల్లు అరవింద్ ని విశ్వనాధ్ గారు అడిగారు. ఒక 2 రోజులు షూటింగ్ ఉంటుందని చెప్పగా.. అందుకు అల్లు అరవింద్ కూడా ఒప్పుకున్నారు. అలా.. అల్లు అర్జున్ కమల్ హాసన్ తో నటించే ఛాన్స్ కొట్టేసారు.


End of Article

You may also like