అల్లు అర్జున్‌కి కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే సినిమా ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ వచ్చింది. అందుకు కారణం పుష్ప. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా ఇంత భాషల్లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యక సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నుండి అల్లు అర్జున్ చాలా ఫేమస్. కానీ పుష్పతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ ఒక ఇమేజ్ సంపాదించారు. ఎంతో మంది ప్రముఖులు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు.

allu arjun fans fires on nayantara for the insult

అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇంటర్వ్యూస్ లో కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు అల్లు అర్జున్. అలాగే చాలా మంది నటులు కూడా అల్లు అర్జున్ ఫ్రెండ్లీగా ఉంటారు అని అంటారు. అల్లు అర్జున్ తనకి ఏదైనా సినిమా నచ్చినా, అది తెలుగు సినిమా కాకుండా ఇతర భాషా సినిమా ఇండస్ట్రీలకి సంబంధించిన సినిమా అయినా కూడా వెంటనే అది సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారు. అలాగే ఆ సినిమాకి సంబంధించిన వారిని అభినందిస్తారు.

allu arjun fans fires on nayantara for the insult

allu arjun fans fires on nayantara for the insult

కానీ, “అంత మంచి వ్యక్తి అయిన అల్లు అర్జున్ కి ఇలాంటి అవమానం జరగడం ఏంటి?” అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అది కూడా నయనతార మీద. అందుకు కారణం ఈ వీడియో. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్ అల్లు అర్జున్ ఇవ్వాల్సి ఉంది. అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ మీదికి వచ్చిన నయనతార “ఈ అవార్డ్ ని ఆ సినిమా డైరెక్టర్ అయిన విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుంటున్నాను” అని అన్నారు. విఘ్నేష్, నయనతార ఈ సినిమా తర్వాత నుండి రిలేషన్ షిప్ లో ఉన్నారు.

allu arjun fans fires on nayantara for the insult

అయితే నయనతార ఈ అవార్డ్ విఘ్నేష్ చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పారు కానీ అవార్డ్ ఇవ్వడానికి ఇవ్వడానికి స్టేజ్ మీద నిల్చొని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ని అనుమతి కూడా అడగలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం అవార్డ్ విఘ్నేష్ కి ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. దాంతో ఫ్యాన్స్ అందరూ, ” అంత సేపు అక్కడే నిలబడి ఉన్న వ్యక్తిని పర్మిషన్ అడుగుదాం అనే కామన్ సెన్స్ కూడా లేదా? లేడీ సూపర్ స్టార్ అనే పేరు ఉంటే సరిపోదు. కొంచెం ఆలోచించాలి. ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యి ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్” అని కామెంట్స్ చేస్తున్నారు.

watch video :