Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు.
Video Advertisement
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ ముప్పై ఏళ్ల తరువాత ఆ ప్రత్యేక వ్యక్తిని కలిశానని, ఆ వ్యక్తి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అల్లు అర్జున్ కలిసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా ‘బిహైండ్ వుడ్స్’ అవార్డ్స్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధానంలో భాగంగా ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డ్ కు అల్లు అర్జున్ ఎంపిక కాగా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ అవార్డ్ ను బన్నీకి అందచేశారు. అవార్డ్ తీసుకున్న తరువాత అల్లు అర్జున్ మాట్లాడుతుండగా వేదిక పైకి తన చిన్ననాటి స్కూల్ టీచర్ రావడంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. అలాగే టీచర్ కి పాదాలకి నమస్కరించారు.
బన్నీ తన టీచర్ గురించి మాట్లాడుతూ “ఆమె పేరు అంబికా కృష్ణన్, 3వ తరగతిలో క్లాస్ టీచర్ అని, ఆమె తనకు చాలా విషయాలను నేర్పించారని తెలిపారు. మా తరగతిలో నేనే లాస్ట్ ర్యాంకర్ ను, అయినప్పటికీ తన టీచర్ ఎప్పుడు తనని ఏమి అనలేదని, లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదని, జీవితం ప్రతి ఒక్కరికీ వరమని, దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావని చెప్పేవారని” అన్నారు. తన టీచర్ ను ఇలా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
తనకు చిన్నతనం నుండి స్ఫూర్తి నింపే విధంగా చిన్న చిన్న కోట్స్ రాసే అలవాటు ఉంది. తాను రాసిన కోట్స్ లో ‘only kindness is remembered forever’ కోట్ రాయడానికి స్ఫూర్తి నా టీచరే అని వెల్లడించారు. అల్లు అర్జున్ తన టీచర్ గురించి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Icon Star @alluarjun Meets His School Teacher After 30 Year's ❤️🔥
Thank You So Much @behindwoods 🥺#Pushpa2TheRule #PushpaTheRule pic.twitter.com/0IdGBj2PTL
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) May 9, 2023
End of Article