పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ పై అటు పవర్ స్టార్ అభిమానులలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతోంది.

Video Advertisement

మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ చూసిన సెలెబ్రెటీలు హరీష్ శంకర్ ను ట్విట్టర్ లో అభినందిస్తున్నారు. హరీష్ శంకర్ వారికి రిప్లై ఇస్తున్నారు. అయితే హరీష్ చేసిన ఓ ట్వీట్ పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఒక ఫ్యాన్ తమ అభిమాన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ నిరూపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా గట్టిగా  చెప్పేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నాడు.
సరిగ్గా 11 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ మూవీ విడుదల అయ్యి నిన్నటికి (మే 11 ) పదకొండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ మూవీ యూనిట్ విడుదల చేసింది. హరీష్ శంకర్ తన అభిమాన హీరోని వెండితెర పై ఆవిష్క‌రించిన విధానానికి ఈ  గ్లింప్స్ స్మాల్ టచ్ అని, మూవీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ  గ్లింప్స్ మాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌నిపిస్తున్నారు. “ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది” అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ సెలెబ్రెటీలు హరీష్ శంకర్ కు అభినందనలు తెలుపుతున్నారు.అయితే రవితేజ పేరు ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఒక యూజర్ “హరీష్ ఈసారి గబ్బర్ సింగ్ కంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నావు. గుడ్ లక్” అని  పోస్ట్ పెట్టారు. ఆ ఖాతాకి బ్లూ టిక్ ఉండడంతో హీరో మాస్ మహారాజ రవితేజ పోస్ట్ అనుకున్న హరీష్ శంకర్ ఎమోషనల్ గా,  “అన్నయ్యా ఈ మొక్క నువ్వు నాటిన మొక్క.. ఎన్నిసార్లయినా చెప్తా ఇదే ముక్క” అని రిప్లై ఇచ్చారు. అయితే అది హీరో రవితేజ అకౌంట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదా అన్నా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: CHATRAPATHI REVIEW : “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” హీరోగా నటించిన ఛత్రపతి హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!