ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మార్చి 28తో ఇరవై సంవత్సరాలు పూర్తయింది. దర్శకేంద్రుడు  రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంతో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 2003 లో  మార్చి 28న విడుదల అయ్యింది. తొలి చిత్రంలో అల్లు అర్జున్ లుక్స్ ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

Video Advertisement

ఆ మూవీ విజయం పొందడానికి ముఖ్య కారణం రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కే 100వ చిత్రం అనే హైప్, అలాగే  కీరవాణి మ్యూజిక్ లో వచ్చిన పాటలు, సమ్మర్ సీజన్ కూడా అవడం కూడా అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పవచ్చు.  ఆర్యతో బన్నీ లుక్స్ ను పూర్తిగా మార్చుకున్నాడు. యువతకి ఐకాన్ గా మారిపోయాడు. వరుస సినిమాలలో నటిస్తూ హిట్స్ ఇస్తూ,  ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
allu-arjuns-shelved-movies4 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బన్నీ కెరీర్ ను మలుపు తిప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిత్రంలో నటించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ కెరీర్లో కొన్ని సినిమాలు ప్రకటన దశలోనే నిలిచిపోయాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..  allu-arjuns-shelved-movies31.అల్లు అర్జున్-వేణు శ్రీరామ్ :
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ప్రకటంతోనే ఆగిపోయింది.
allu-arjuns-shelved-movies2.అల్లు అర్జున్-లింగుస్వామి :
లింగుస్వామి పందెం కోడి, ఆవారా సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగారు. లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్  ఒక మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటికి దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
allu-arjuns-shelved-movies23.అల్లు అర్జున్-కొరటాల శివ :
దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే  ఆచార్య ఫలితం కారణంగానేమో అల్లు అర్జున్ ఈ మూవీ విషయంలో వెనక్కి తగ్గాడు.
allu-arjuns-shelved-movies1Also Read: బలగం చిత్రంలో ‘సాయిలు’ పాత్రకు ముందు అనుకున్నది ప్రియదర్శి కాదంట.. ఆ నటుడు ఎవరంటే..