ఇటీవల కాలంలో కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు మంచి కంటెంట్ ఉండి చిన్న చిత్రాలుగా విడుదల అయ్యి, భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన చిత్రం  బలగం. వేణు వెల్డండి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Video Advertisement

చిన్న సినిమాగా రూపొందిన ‘బలగం’ రిలీజ్ అయిన తరువాత బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. కమెడియన్ వేణు వెల్దండికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఈ ఎమోషనల్ సినిమాని చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు.
balagam-priyadarshi-2బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతుండటం విశేషం. ఇక బలగం మూవీ యూనిట్ కూడా మూవీకి సంబంధించిన పలు విషయాలను రివీల్ చేస్తూ, ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
balagam-priyadarshi-1ప్రియదర్శి ఈ మూవీలో సాయిలు అనే క్యారెక్టర్ లో నటించాడు.  తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు కాల్ చేసి వేణు స్టోరి చెప్తాడు వినమని చెప్పారు. వేణు చెప్పిన స్టోరి నకు విపరీతంగా నచ్చింది. దాంతో వెంటనే అంగీకరించానని చెప్పాడు. అయితే ఈ మూవీలో సాయిలు పాత్రలో ముందు వేణునే చేయాలని భావించారంట. తరువాత ప్రియదర్శిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. సాయిలు క్యారెక్టర్ వేణునే చేసుంటే మంచి చిత్రాన్ని మిస్ అయ్యేవాడినని  ప్రియదర్శి తెలిపారు.
Also Read: ఆ సినిమాతో ప్రపంచ రికార్డు సాధించి చరిత్ర సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్‌..