బెల్లంకొండ శ్రీనివాస్ టాప్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన ‘జయజానకి నాయక’ మూవీ తాజాగా ప్రపంచ రికార్డును సృష్టించింది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకగా నటించింది.
Video Advertisement
జయజానకి నాయక చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదల అయినప్పటికి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. అయితే యాక్షన్ సన్నివేశాలలో బోయపాటి మార్క్ ఉండడంతో మైనస్ గా మారింది. ఇక ఈ చిత్రం హిందీ వర్షన్ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. జయజానకి మూవీ హిందీ వర్షన్ కు చాలా మంచి రెస్పాన్స్ లభించింది.ఇప్పుటికి ట్రేండింగ్ లో ఉన్నఈ చిత్రం తాజాగా వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈ చిత్రానికి 709 కోట్ల వ్యూస్ తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి దాకా ప్రపంచం వ్యాప్తంగా 709 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి చిత్రంగా జయ జయ నాయక సినిమా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులోఆశించిన స్థాయిలో విజయం పొందలేకపోయినా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత రెండవ స్థానంలో 702 కోట్ల వ్యూస్ తో కేజీఎఫ్ ఉంది.
అల్లుడు శ్రీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ మొదటి మూవీ సూపర్ హిట్ అయ్యింది. నటుడిగా బెల్లంకొండకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాని చేశాడు. ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ విజయాన్ని సాధించలేదు. ఈ మూవీ హిందీ వెర్షన్ తో బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో క్రేజ్ ఏర్పడింది.
బెల్లంకొండ నటించిన చిత్రాలన్ని హిందీ వెర్షన్‌లకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. కవచం, సీతా, స్పీడున్నోడు, సాక్ష్యం లాంటి చిత్రాలకు వందల మిలియన్లలో వ్యూస్ లభించాయి. ఇక ఇప్పుడు శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
Also Read: విడాకుల వార్తల తరువాత మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్.. వైరల్ గా మారిన ఫోటోలు..