Ads
సరైన జీవన విధానం లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం మొదలైన కారణాల వల్ల డిమెన్షియా సమస్య వస్తుంది. డిమెన్షియా అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా డిమెన్షియా అంటే మెమరీ లాస్. అయితే వట్టి మెమరీ లాస్ మాత్రమే ఉంటే డిమెన్షియా కాదు. డిమెన్షియా తో పాటుగా అల్జిమర్స్ మొదలైన బ్రెయిన్ సమస్యలు ఈ తప్పులు చేయడం వల్ల వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Video Advertisement
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పులు వల్ల ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
#1. సరైన జీవన విధానం లేకపోవడం:
సరైన విధానం లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలాంటి సమస్యలు కూడా మీ దరి చేరవు.
#2. నిద్ర లేకపోవడం:
మంచి నిద్ర లేకపోవడం వలన కూడా డిమెన్షియా, ఆల్జీమర్స్ మొదలైన సమస్యలు వస్తాయి కనుక సరైన నిద్ర ఉండడం చాలా ముఖ్యం.
#3. డిహైడ్రేషన్:
ఇది కూడా ఎన్నో రకాల సమస్యల్ని కలిగిస్తుంది రోజు ఎనిమిది గ్లాసులు నీళ్లు అయినా తాగాలి.
#4. డ్రగ్స్ మరియు ఆల్కహాల్:
డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
#5. సరైన ఆహారం తీసుకోకపోవడం:
ఆహారం సరిగ్గా లేకపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. చీజ్ బట్టర్ మొదలైన వాటికి బదులుగా పండ్లు వంటివి తీసుకుంటే మంచిది.
End of Article