Ads
మగవారు అయినా, ఆడవారు అయినా చాలా మంది ఎదుర్కునే సమస్య కాలి పగుళ్లు. ఇవి ఒకసారి వచ్చాయంటే తొందరగా పోవు. సీజన్ మారడం వలన కూడా చాలా మందికి కాలి పదాలు పగులుతూ ఉంటాయి. కొంతమందికి రక్తం కూడా వస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు.
Video Advertisement
రోజు పొలం పనులు చేసేవారికి, ఎక్కువగా నీళ్లలో పని చేసేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే., రెండు చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఓ బకెట్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. నీరు ఎక్కువ వేడిగా ఉంటె పగుళ్లు ఉన్న పాదాలకి మంట పుడుతూ ఉంటుంది. అందుకే.. మీ పాదాలు భరించగలిగే వేడిని మాత్రం ఉంచుకోండి. ఆ నీటిలోనే ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక షాంపూ, ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేయాలి. ఒక అరగంట సేపు మీ పాదాలని ఆ నీటిలో ఉంచాలి. ఆ నీటికి మీ పాదాలు శుభ్రపడడమే కాకుండా, పగుళ్లు కూడా మెత్త పడతాయి. ఆ తరువాత ఫుట్ స్క్రాపర్ మరియు ప్యూమిక్ స్టోన్ సాయంతో పగుళ్లపై బలంగా రుద్దాలి. పాదాలపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. పాదాల వద్ద ఉన్న డెడ్ స్కిన్ పోయి మీ పాదాలు మృదువుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఆ తరువాత మీ పాదాలను ఒక క్లాత్ తో తుడుచుకుని ఫుట్ క్రీంను అప్లై చేసుకోవాలి. ఈ ఫుట్ క్రీం ను కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ లో వాసెలిన్ పెట్రోలియం జెల్ ను తీసుకోవాలి. దానిలో కొంచం పసుపు, వెజిటల్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసుకోవాలి. ఆ తరువాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవాలి.
అది లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ను అయినా వేసుకోవచ్చు. ఈ వాసెలిన్ కరిగేవరకు ఆ బౌల్ ను వేడినీటిలో ఉంచాలి. అది కరిగిన తరువాత రాత్రి సమయాల్లో మీ పాదాలకు రాసుకుని పడుకుంటే.. మరుసటి రోజుకు మృదువుగా అవుతాయి. ఇలా క్రమం తప్పకుండ చేస్తే మీ పాదాల పగుళ్లు పోయి మృదువుగా ఉంటాయి.
End of Article