టీవీలు, ల్యాప్‌టాప్ లతో సహా వారంలో 1.3 లక్షల ప్రొడక్ట్స్ ని అమెజాన్ కావాలనే పాడు చేసేస్తుంది.. కారణమేంటో తెలుసా..?

టీవీలు, ల్యాప్‌టాప్ లతో సహా వారంలో 1.3 లక్షల ప్రొడక్ట్స్ ని అమెజాన్ కావాలనే పాడు చేసేస్తుంది.. కారణమేంటో తెలుసా..?

by Megha Varna

Ads

ప్రతి వారం అమెజాన్ లక్షా ముప్పై వేల ప్రొడక్ట్స్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అయితే వాటిల్లో చాల విలువైన వస్తువులు కూడా ఉంటాయి. ఎందుకు అసలు వస్తువులని డ్యామేజ్ చేస్తారు..? దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Video Advertisement

అమెజాన్ లో పని చేసే వారిని లక్షా ముప్పై వేల ప్రొడక్టులను నాశనం చేయమని టార్గెట్ ఇస్తారు. అయితే బాగా ఖరీదైనవి కూడా ఉంటాయి. ఐఫోన్, మ్యాక్ బుక్, టీవీలు, ఫ్రిడ్జ్లు మొదలైన ప్రొడక్ట్స్ ఎన్నో ఉంటాయి. అదే విధంగా ఆ వారంలో 28 వేల ప్రోడక్ట్స్ ని డొనేట్ చేయడం జరుగుతుంది.

సంవత్సరంలో ఎన్ని ప్రొడక్ట్స్ ని నాశనం చేయడం జరుగుతుంది అనేది చూసుకుంటే… ప్రతి సంవత్సరం కూడా 60 లక్షల వరకూ ప్రొడక్ట్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. అయితే వాళ్లు నాశనం చేయడానికి గల కారణం ఏమిటంటే…? సప్లయర్లు ప్రొడక్ట్స్ ని అమెజాన్ వార్హౌస్ లో పెడతారు. అక్కడ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ స్టోరేజ్ చేయడానికి సెల్లెర్స్ నుండి డబ్బులు తీసుకుంటుంది.

Amazon: Melbourne Location of First Warehouse, Step Toward Launching | Fortune

కొంత మంది మాత్రం డబ్బులు చెల్లించరు. అందుకని వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ ని సప్లేయిర్స్ కి పంపించాలి. కానీ ఇంటర్నేషనల్ సెల్లర్లకి ఈ ప్రోడక్ట్స్ ని పంపించడం కంటే నాశనం చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. అమెజాన్ కనుక ఆ ప్రోడక్ట్స్ ని తిరిగి పంపించాలి అంటే అప్పుడు ఎక్కువ డబ్బు అమెజాన్ కి ఖర్చు అవుతుంది. రిటర్న్ పంపడానికి ఇలా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ ప్రొడక్ట్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. వీటిలో చాలా కొత్తవి ఉంటాయి. ఎంతో ఖరీదైనవి కూడా ఉంటాయి. పైగా ఇప్పటి వరకు ఉపయోగించనివి కూడా ఉంటాయి.


End of Article

You may also like