1964 లో “అంబాసిడర్” కార్ బిల్ చూశారా..? అప్పుడు కార్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

1964 లో “అంబాసిడర్” కార్ బిల్ చూశారా..? అప్పుడు కార్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Mounika Singaluri

Ads

అంబాసిడర్ కార్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. వీటిని మన రాజకీయ నాయకులూ, అలాగే సినిమాల్లో ఎక్కువగా వాడేవారు. రాజకీయ నాయకుల నుండి పరిపాలనలో ఉన్న వ్యక్తుల వరకు అప్పట్లో విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే మారుతీ సుజుకీ వచ్చిన తర్వాత దాని ఆదరణ తగ్గింది. కానీ ఈ కారుప్రయాణం అంటే.. ఇప్పటికీ చాలా మందికి మక్కువ.

Video Advertisement

అయితే 2014లో ఈ కారు ఉత్పత్తిని హిందుస్థాన్ మోటార్స్ నిలిపివేసింది. అయితే అంబాసిడార్ కారుపై ప్రేమ ఉన్న వారు ఇప్పటికీ ఆ పాత కార్లనే మోడిఫై చేసుకుంటున్నారు. మోడ్రన్​ గా తయారు చేయించుకుంటున్నారు. ఈ కార్ల తయారీ నిలిపేనాటికి అయితే వీటి ధర సుమారు నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యేది. అయితే తాజాగా 1964 నాటి అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో దాని ధర 16 ,495 రూపాయలుగా ఉంది.

price of ambassador in 1964..!!

1964 లో మద్రాసులోని గుప్తాస్ స్టేట్స్ హోటల్ కి ఈ కార్ ని డెలివరీ ఇచ్చినట్టుగా వైరల్ అవుతున్న ఆ ఇన్వాయిస్ లో ఉంది. ట్రైన్ లో పశ్చిమ బెంగాల్ నుంచి ఈ కార్ మద్రాస్ కి వచ్చినట్టుగా అందులో పేర్కొన్నారు. ఆ కార్ అసలు ధర 13 , 787 రూపాయలు కాగా.. సర్ ఛార్జ్ 255 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 897 రూపాయలు, మద్రాస్ జనరల్ సేల్స్ టాక్స్ 1 ,493 రూపాయలు, రిజిస్ట్రేషన్ కి 54 రూపాయలు, నెంబర్ ప్లేట్ రాయడానికి 7  రూపాయలు అయినట్టు ఆ ఇన్ వాయిస్ లో వివరించారు. మొత్తం గా 16 ,495 రూపాయలు అయింది.

price of ambassador in 1964..!!

రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఈ ఇన్ వాయిస్ లో ఆ బ్రాంచ్ మేనేజర్, అకౌంటంట్ సైన్స్ కూడా మనం చూడొచ్చు. వైరల్ గా మారిన ఈ ఇన్ వాయిస్ ని చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఆ కార్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ.. 1972లో మా నాన్న అంబాసిడర్ కారును రూ. 18000కి కొన్నారు అని రాశారు.


End of Article

You may also like