Ads
ఈ కింద ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు అమ్మాయిల పేర్లు లక్ష్మిసాహిత్య, వెంకట శ్రీహిత, అమృత హర్షిణి. వీరి వయసు 19 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా డిగ్రీ చదువు కూడా పూర్తి అవ్వలేదు. కానీ.. వీరి టాలెంట్ కి ఓ అమెరికన్ సంస్థ ఫిదా అయ్యింది. వీరికి ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చింది.
Video Advertisement
అంతేకాదు.. వీరు ఎం ఎస్ చేయదల్చుకుంటే.. అందుకు అవసరమైన ఖర్చుని కూడా తామే భరిస్తామని ముందుకొచ్చింది. ఇదంతా ఎందుకో తెలుసా..? ఆ సంస్థ తాలూకు యాప్ ను రూపొందించడంలో వీరు సాయం చేసారు.
Also Read: ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.?
వివరాల్లోకి వెళితే.. ఈ ముగ్గురు అమ్మాయిలు గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్ వర్సిటీ)లో బీసీఏ చదువుకుంటున్నారు. ఈ విద్యాలయం తాలూకు ఇతర సంస్థలలోని విద్యార్థులందరికీ కలిపి కోడింగ్ పరీక్షని నిర్వహించారు. ఈ పరీక్షలో ఈ ముగ్గురు అమ్మాయిలు టాప్ ప్లేస్ లో నిలిచారు. వీరికి కోర్స్ లో భాగంగా ఇంటర్న్షిప్ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ‘మాన్ బ్రోసిన్’ సంస్థ కేఎల్ వర్సిటీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఆఫర్ ను ఇచ్చింది. కోడింగ్ పోటీలలో ఈ ముగ్గురు విద్యార్థినిలు కనబరిచిన ప్రతిభకు ‘మాన్ బ్రోసిన్’ సంస్థ అధికారులు ముగ్ధులయ్యారు. వారు ఈ ముగ్గురు విద్యార్థులకు ఇంటర్వ్యూ ను కూడా నిర్వహించారు. అందులో వీరు ప్రతిభ కనబరచడంతో ఇంటర్న్షిప్ కు ఎంపిక చేసారు.
పగలు తరగతులు, రాత్రుళ్ళు ఆన్లైన్ ఇంటర్న్షిప్లోను పాల్గొనే వారు. మరోవైపు ఆ సంస్థ ‘నాబ్ హబ్’ అనే అప్లికేషన్ ను రూపొందించే పనిలో ఉంది. కొన్నిరోజులు ఈ ముగ్గురమ్మాయిలకు కూడా ఆ పనిలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ పనిలో ఈ ముగ్గురు విద్యార్థులు కూడా సాయం చేసారు. లేబుల్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఫీచర్లు, కంటెంట్ డెవలప్మెంట్,18 భాషల్లోకి కంటెంట్ కన్వర్షన్ , టెస్టింగ్ వంటి అంశాలలో వీరు కీలక పాత్ర పోషించారు.
వీరి పని కి అమెరికన్ సంస్థ వారు ఫిదా అయ్యారు. ఎం ఎస్ కు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పారు. తమ సంస్థలోనే ఉద్యోగం ఇస్తామని పిలుపునిచ్చారు. యాప్ ఆవిష్కరణను కూడా వీరి కాలేజీ క్యాంపస్ లోనే చేయనున్నారు. వీరు ఈ యాప్ కి పనిచేస్తున్న రోజులలో కరోనా ఉద్ధృతంగా ఉంది. ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా కుదర్లేదు. రాత్రి సమయాల్లో ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేస్తూ.. పగలు సమయాల్లో జూమ్ యాప్ లో చర్చలు జరుపుకునే వారు.
ఆన్లైన్ లో తరగతులకు కూడా హాజరు అయ్యారు. దాదాపు రెండు నెలల పాటు రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడ్డారు. వీరు ముగ్గురు మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. సాహిత్యది అమరావతికి దగ్గరలోని ఓ ఊరు. ఆమె తల్లి తండ్రులు గాడిపర్తి సాంబశివరావు, అమ్మ నారాయణమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇక శ్రీహిత తండ్రి కారసాని వెంకట శివారెడ్డి ఫిరంగిపురంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆమె తల్లి అమ్మ కల్యాణి గృహిణి. మూడవ అమ్మాయి అమృతది నరసరావుపేట. ఆమె తండ్రి సైదా గుర్నాధం ఆయిల్ వ్యాపారం చేస్తారు. అమ్మ లక్ష్మీ కుమారి గృహిణి.
వీరు ముగ్గురు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. తమ ప్రతిభకు పరిస్థితులు అడ్డం కావని నిరూపించారు. పెద్దలు ఏమి చెప్పినా మన మంచికే చెప్తారని.. పది, ఇంటర్ అయిపోగానే కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని చెప్తారు ఈ అమ్మాయిలు. ఈ వయసులో సరదాలు కూడా ఎక్కువగానే ఉంటాయని, వాటిని పక్కన పెట్టమని మేము చెప్పట్లేదని.. కానీ అవే లోకం అవ్వకూడదని హితవు చెప్తున్నారు. దేనిలో చేరాలి అన్న ఛాయిస్ మన చేతిలోనే ఉండాలని.. అప్పుడే మన భవిష్యత్ ని మనమే నిర్ణయించుకున్నట్లు అవుతుందని అంటున్నారు ఈ అమ్మాయిలు.
End of Article