సాధారణం గా దొంగ అన్న పేరు వినగానే మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే.. మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ములను, విలువైన వస్తువులను దోచుకుంటారు అన్న ఉద్దేశ్యం మనలో ఉండిపోతుంది కాబట్టి.. మనకి దొంగలు అనగానే.. అంత సదభిప్రాయం కలగదు. కానీ దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారు అని ఫ్లాయిడ్ లాంటి వాళ్ళు నిరూపించారు. అదెలానో చూద్దాం రండి.

pretty boy floyd 2

అమెరికా కు చెందిన ఫ్లాయిడ్ అనే ఓ దొంగ అమెరికన్ బ్యాంక్స్ లలో దొంగతనం చేసేవాడు. అయినప్పటికీ… అతనంటే అమెరికన్స్ చాలా అభిమానం చూపేవారట. అతనిని ప్రెట్టీ బాయ్ ఫ్లాయిడ్ అని పిలుచుకుంటారట. అతను ఎక్కువ గా బ్యాంకుల లోనే దొంగతనం చేసేవాడట. అతను దొంగతనం చేయడానికి వెళ్లిన ప్రతి బ్యాంకు లోను పేదవారు అప్పు తీసుకున్న తాలూకు లోన్ కాగితాలను చింపేసేవాడట.

floyd

అతను దొంగతనం చేసినప్పటికీ… అతను లోన్ కాగితాలను చింపేయడం వలన అమెరికా లోని పేదవారికి రుణ మాఫీ అయిపోతూ ఉండేది. దీనితో.. అమెరికన్లు అతనిపై అభిమానం పెంచుకోవడం ప్రారంభించారు. చివరకు ఈ అభిమానం ఎంత పెరిగింది అంటే.. ఆ దొంగ చనిపోయిన తరువాత.. అతని అంత్యక్రియలకు చాలా మంది హాజరు అయ్యి సంతాపం తెలిపారట. ఎంతైనా మంచి దొంగ కదూ..