అనంత్ అంబానీ ఫిట్‌నెస్ ట్రైనర్ ఎవరో తెలుసా..? అతని జీతం ఎంతంటే..?

అనంత్ అంబానీ ఫిట్‌నెస్ ట్రైనర్ ఎవరో తెలుసా..? అతని జీతం ఎంతంటే..?

by Harika

Ads

ముఖేష్ అంబానీ భారత దేశంలోనే రిచెస్ట్ మాన్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన మెయింటినెన్స్ గురించి ఇంట్లో ఉండే పని వాళ్ళ జీతాల గురించి వాళ్ళ తినే ఫుడ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక వాళ్ళింట్లో పెళ్ళి జరిగితే దేశం మొత్తం దాని గురించి చర్చించుకుంటుంది.

Video Advertisement

అయితే తాజాగా ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఫిట్నెస్ ట్రైనర్ మంత్లీ శాలరీ గురించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అనంత్ అంబానీ ఎంత లావుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గతంలో 108 కిలోలు ఒకేసారి తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. కానీ ఆకస్మాత్తుగా మళ్లీ బరువు పెరిగిపోయారు. అయితే బరువు తగ్గినప్పుడు మాత్రం అకస్మాత్తుగా ఇంత వెయిట్ లాస్ ఎలా జరిగింది అని అందరికీ ఆశ్చర్యం కలిగింది.

neetha ambani about anant ambani..

అయితే ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కఠినంగా ఈయనతో వ్యాయామాలు చేయించడం కారణంగానే ఒకసారిగా బరువు తగ్గాలని తెలుస్తుంది.ఇంతకీ అనంత్ అంబాని ఫిట్నెస్ ట్రైనర్ ఎవరంటే వినోద్ చన్నా. ఈయన ముఖేష్ అంబానీకి, నీతా అంబానీ కి కూడా పర్సనల్ ట్రైలర్ గా పని చేస్తారు. ఈయన కఠినమైన ఆహార నియమాలను పెట్టి, కష్టమైనా వ్యాయామలు చేయించి కేవలం 18 నెలలలోనే 108 కిలోల బరువుని తగ్గించారంట వినోద్ చన్నా.

anant ambani fitness trainer salary

అయితే ఇతను పర్సనల్ ట్రైనింగ్ కోసం 3.5 లక్షలు నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తాడని సమాచారం. ఇతను అనంత్ అంబానీకి శిక్షణ ఇవ్వటంతో పాటు కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రామ్ పాల్ వంటి అనేకమంది బాలీవుడ్ తారలకి ఫిట్నెస్ ట్రైనింగ్ అందించారు. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ఎంగేజ్మెంట్ గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం జూలై 12న వీరి పెళ్లి జరగబోతుంది.


End of Article

You may also like