అనంత్ అంబానీ పెళ్లి పత్రిక చూశారా..? పెళ్లి ఏ పద్ధతిలో జరగబోతోంది అంటే..?

అనంత్ అంబానీ పెళ్లి పత్రిక చూశారా..? పెళ్లి ఏ పద్ధతిలో జరగబోతోంది అంటే..?

by Harika

Ads

అంబానీ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొంత కాలం క్రితం వీరి పెళ్ళికి ముందు ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు మరొక ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం అంతా కూడా యూరప్ కి వెళ్లారు. ఈ ఈవెంట్ క్రూజ్ లో జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అవుతున్నారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఘనంగా వేడుకలు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈసారి విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాకుండా వచ్చిన అతిధులకి ఎంతో ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వాలి అని అంబానీ కుటుంబం అనుకున్నారు.

Video Advertisement

anant ambani wedding invitation

అయితే ఇప్పుడు అంబానీ పెళ్లి వేడుకకి సంబంధించిన పెళ్లి పత్రిక కూడా బయటికి వచ్చింది. “శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం.వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం” శ్లోకంతో వెడ్డింగ్ కార్డ్ లో వివరాలు రాయడం మొదలుపెట్టారు. కోకిల బెన్, ధీరుభాయ్ అంబానీ గారి ఆశీస్సులతో, పూర్ణిమ బెన్, రవీంద్రభాయి దలాల్ గారి ఆశీస్సులతో పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు ఉంది. అనంత్, రాధిక అని రాసి, కింద శైలా మర్చంట్, వీరేన్ మర్చంట్ అని రాధిక తల్లిదండ్రుల పేర్లు రాశారు. ఆ తర్వాత వివాహం జరిగే తేదీ, డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. ఇది చూస్తే,

వివాహం- శుక్రవారం, జులై 12 వ తేదీ, 2024. డ్రెస్ కోడ్ – ఇండియన్ ట్రెడిషనల్.

ఆశిర్వాద్- శనివారం, జులై 13 వ తేదీ, 2024. డ్రెస్ కోడ్ – ఇండియన్ ఫార్మల్.

మంగళ్ ఉత్సవ్ (రిసెప్షన్) – ఆదివారం, జులై 14 వ తేదీ, 2024. డ్రెస్ కోడ్ – ఇండియన్.

ఇదంతా జియో వరల్డ్ సెంటర్ లో ఇదంతా జరుగుతుంది అని ఇచ్చారు. కింద నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పేర్లను ఇచ్చారు. చివరిలో ప్రేమతో, ఈషా, ఆనంద్, శ్లోక, ఆకాష్ ఆహ్వానిస్తున్నట్టు, ఆనందంతో పృథ్వి, ఆదియశక్తి, కృష్ణ, వేద పిలుస్తున్నట్టు రాశారు.


End of Article

You may also like