బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపైఅనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ తన మాటతీరుతోనే కాకుండా అందచందాలతో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నారు. కేవలం బుల్లితెర కార్యక్రమాలను మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయకి పలు సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.
Video Advertisement
ఈ క్రమంలోనే అటు వెండి తెరపై కూడా ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒక షో చేస్తే దాదాపు మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకొనేవారట. ఇక సినిమాల విషయానికొస్తే వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ గా మారింది అనసూయ.
ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం లో అనసూయ ‘దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట అనసూయ. ఇక పుష్ప ది రైజ్ లో అనసూయ పాత్ర నిడివి పెరగటం తో పాటు.. ఆ పాత్ర ప్రాధాన్యత కూడా పెరగబోతుందట. అలాగే వరుస సినీ అవకాశాలతో అనసూయ తన రెమ్యూనరేషన్ పెంచిందని తెలుస్తోంది.
యాంకర్ అనసూయ ఒక్కరోజు పారితోషికం ప్రస్తుతం రోజుకు 3 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. అనసూయ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అనసూయ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండగా ఆమె నటించిన చిన్న సినిమాలు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోకపోయినా పెద్ద సినిమాలకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడే అనసూయ సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. కెరీర్ విషయంలో అనసూయ ప్లానింగ్ పర్ఫెక్ట్ అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.