సినిమాల పరంగా పూజా హెగ్డే కి ఈ ఏడాది అసలు కలిసి రాలేదు. స్టార్ హీరోలతో నటించిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. గత సంవత్సరం పూజా కి అన్ని హిట్ లే. 2022 స్టార్టింగ్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ తో సహా బీస్ట్, ఆచార్య, ఎఫ్ 3 లాంటి సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ పూజా వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ గానే ఉంది.

Video Advertisement

 

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు బిగ్ ప్రాజెక్టులు, తెలుగులో త్రివిక్రమ్ – మహేష్ చిత్రం లో నటిస్తోంది పూజ. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్, సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న కిసీకా భాయ్..కిసీకి జాన్ చిత్రాల్లో నటిస్తోంది పూజ. వీటిలో ఏ సినిమా హిట్ అయినా పూజ తిరిగి ఫామ్ లోకి వస్తుంది.

anchor questions pooja hegde about her famous film..!!

అయితే తాజాగా పూజ ఒక చిట్ చాట్ లో పాల్గొంది. ఆ చాట్ లో పూజ తో పాటు కెజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి , హీరోలు కార్తీ, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నారు. అయితే వారందరి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్న యాంకర్ శ్రీనిధి – కెజీఎఫ్ హీరోయిన్, కార్తీ – పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాల హీరో, దుల్కర్ సల్మాన్ – సీతారామం హీరో, వరుణ్ ధావన్ – జగ్ జగ్ జియో హీరో అని చెప్పి.. పూజ హెగ్డే మీరు ఏ సినిమాతో పాపులర్ అయ్యారు అని అడిగాడు. దీంతో పూజ తో పాటు అక్కడున్న ఇతర నటులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూజ కి పాన్ ఇండియా రేంజ్ ఒక్క హిట్ కూడా లేకపోవడం తో ఆ యాంకర్ అలా మాట్లాడడంటూ ఆమె ఫాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

anchor questions pooja hegde about her famous film..!!

కెరీర్ స్టార్టింగ్ నుంచి పూజ హెగ్డే బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు చాలా ట్రై చేస్తోంది కానీ ఆమెకు కలిసి రాలేదు. ఈ డిసెంబర్ 23న రిలీజవుతున్న ‘సర్కస్’ మూవీపై పూజా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ సినిమా సక్సెస్ తో 2022 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ముగించాలనుకుంటోంది పూజా. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ చేసింది.

 

 

watch video: