రష్మి నటించిన ఈ సీరియల్ ఏంటో తెలుసా..? అందులో ఎలాంటి పాత్రలో నటించారంటే.?

రష్మి నటించిన ఈ సీరియల్ ఏంటో తెలుసా..? అందులో ఎలాంటి పాత్రలో నటించారంటే.?

by kavitha

Ads

యాంకర్ రష్మిగౌతమ్ గురించి బుల్లితెర ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా సినీ  పరిశ్రమలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన రష్మి, ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ షోతో బాగా ఫేమస్ అయ్యింది.

Video Advertisement

తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, పదేళ్లుగా జబర్దస్త్ షోని విజయవంతంగా నడవడంలో రష్మి కీలక పాత్ర పోషిస్తుంది.  ఇక అవకాశం వచ్చినపుడు వెండితెరపై కూడా కనిపిస్తూ, రాణిస్తోంది. అయితే ఆమె సీరియల్స్ లో కూడా నటించింది.  రష్మి నటించిన సీరియల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రష్మిగౌతమ్ కెరీర్‌ సినిమాలతోనే మొదలైంది. 2002లో ‘సవ్వడి’ అనే మూవీతో మొదటిసారి నటించింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్, రిచా జంటగా నటించిన హోలీ మూవీలో సహాయ పాత్రలో నటించింది.  పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది. ఆ తరువాత 2010లో వచ్చిన ప్రస్థానం మూవీలోనూ రష్మి సహాయనటిగా చేసింది. 2011 లో  కందెన్ అనే తమిళ సినిమాలో  హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

అలా ఆమె కందెన్ చిత్రంలో నర్మద అనే పాత్రలో నటించగా,  ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. హిందీ సినిమాలలో కూడా రష్మిగౌతమ్ కనిపించారు. 2013 లో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రష్మి, తక్కువ కాలంలో చాలా పాపులర్ అయ్యింది.  హాట్‌ యాంకర్‌గా పదేళ్ళ నుండి జబర్దస్త్ కు యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ, క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మి సీరియల్స్ లో కూడా నటించినట్లుగా వెల్లడించింది. ఆమె సీరియల్స్ లో నటించిన విషయం  చాలామందికి తెలియదు. యువ అనే సీరియల్ లో నటించింది. అందులో స్వాతి అనే క్యారెక్టర్ లో నటించిన  రష్మి గౌతమ్‌ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత లవ్ అనే సీరియల్ లో మౌనిక అనే పాత్రలో నటించింది. మా టీవిలో ప్రసారం అయిన రెండు సీరియల్స్ తో పేరు తెచ్చుకున్న ఆమెకు మళ్ళీ సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

Also Read: డాన్స్ లో చిరంజీవికే పోటీగా వచ్చిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?


End of Article

You may also like