ఢీ, జబర్దస్త్ వంటి షోలలో యాంకరింగ్ చేస్తూ.. రష్మీ గౌతమ్ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అవకాశాలు వచ్చినప్పుడు వెండితెర పై కూడా నటిస్తూ.. రష్మీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ వస్తున్నారు. కేవలం అందం, టాలెంట్ మాత్రమే కాదు.. ఆమె స్టయిల్ కి కూడా చాలా మంది ఫాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

rashmi 1

మరో వైపు.. రష్మీ-సుధీర్ జంట కు కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. యు ట్యూబ్ కపుల్ గా ఈ జంట కు మంచి ఫాలోయింగ్ ఉంది. అసలు వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ నే వీరికి మరింత పాపులారిటీ ని తీసుకొచ్చింది. ఓ వైపు.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి చేసుకోవాలని ఫాన్స్ ఫీల్ అయిపోతూ ఉంటె.. వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని పలు సందర్భాలలో స్పష్టం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ నెటిజెన్ల కామెంట్స్, పెళ్లి గురించిన క్వశ్చన్స్ ఆగలేదు.

rashmi 2

ఇటీవల జబర్దస్త్ ఆర్టిస్ట్ వర్ష తన పై వస్తున్న ట్రోల్స్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భం లో రష్మీ కూడా స్పందించారు. ఏ విషయం లో అయినా అమ్మాయిలు అబ్బాయిలు సమానమని అంటూ ఉంటారని.. చెప్పుకొచ్చారు. సుధీర్ ఏ హీరోయిన్ తో ఆక్ట్ చేసినా ఒప్పుకుంటారని.. కానీ నా విషయం లో అలా ఉండదన్నారు.

rashmi 3

రీసెంట్ గా నాది ఓ ట్రైలర్ రిలీజ్ అయితే.. అందులో సుధీర్ ఆక్ట్ చేస్తే బాగుండేదని పలువురు కామెంట్స్ చేసారని వాపోయారు. ఇక్కడ అందరం కలిసి పని చేసినా.. మా పర్సనల్ లైవ్స్ వేరే ఉంటాయని ఎందుకు ఒప్పుకోరన్నారు. అబ్బాయిలు ఎంతమందితో పులిహోర కలిపినా తప్పు గా చూడరని.. కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరం గా మరొకరితో నటిస్తే మాత్రం తప్పుబడతారని ఆవేదన చెందారు.