తెలుగు బుల్లితెరపైకి పెద్ద సంఖ్యలోనే యాంకర్లు ఉన్నారు. అయితే, గతంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే హోస్టులుగా సందడి చేసేవారు. అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

Video Advertisement

‘వావ్’ ది అల్టిమేట్ గేమ్ షో తో టీవీ లో తన కెరీర్ మొదలుపెట్టింది శిల్పా చక్రవర్తి. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన ఆమె అనేక స్టేజి పెరఫార్మన్సులు ఇచ్చింది. తర్వాత 2018 లో ‘కంటే కూతుర్నే కను’ సీరియల్ లో కూడా నటించారు శిల్ప.

anchor shilpa chakravarthy viral pics
యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో భాగం అయింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది.

anchor shilpa chakravarthy viral pics
తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్లారు. ఈ అవకాశం తో ఆమె కెరీర్ మళ్ళీ పుంజుకుంటుందని భావించారు అంతా. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయారు. కేవలం రెండు వారాలే బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయ్యి ఫాన్స్ ను నిరాశ పరిచారు.

anchor shilpa chakravarthy viral pics
శిల్ప కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే వివాహం తర్వాత కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన శిల్ప సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటున్నారు. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

anchor shilpa chakravarthy viral pics
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిల్ప చక్రవర్తి ఏంటి ఇలా అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.