యాంకర్ శ్రీముఖి ఎంత అల్లరిపిల్లో అందరికి తెలిసిందే. ఫుల్ ఎనర్జీ తో ఆమె ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు. తాజాగా. స్టార్ మా లో స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ షో కి ఆమె యాంకరింగ్ చేసారు. ఈ షో కు “కార్తీక దీపం” టీం అంతా వచ్చి బాగా సందడి చేసారు. నిరుపమ్, మోనిత, భాగ్యం పాల్గొని ఎంటర్టైన్ చేసారు. అయితే.. ఈ షో లో వంటలక్క మాత్రం కనిపించలేదు.

karthika deepam

షో లో భాగం గా స్టేజి పైనే శ్రీముఖి డాక్టర్ బాబు నిరుపమ్ పరువు తీసేసింది. మోనిత వస్తే తప్ప మూడ్ రాదా.. అంటూ డాక్టర్ బాబుని ఆటపట్టించేసింది. యాంకర్ శ్రీముఖి ఈ డైలాగ్ వేయగానే అక్కడ షో లో ఉన్నవారందరూ నవ్వేశారు. డాక్టర్ బాబు ఒక నిమిషం షాక్ అయినా.. వెంటనే నవ్వేసి లైట్ తీసుకున్నారు. చివరగా.. డాక్టర్ బాబు ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని ఎంటర్టైన్ చేసారు.