శ్రీముఖి యాంకర్ గా రాణిస్తూ అందరి మన్ననలను పొందుతున్న సంగతి తెలిసిందే. యాంకర్ కాకముందు ఆమె మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది. మొదటగా జులాయి సినిమాతో హీరో చెల్లెలి గా ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీముఖి బుల్లితెరపైనా రాణిస్తోంది. ఆమె యాంకర్ గా నే కాక సోషల్ మీడియా లో కూడా ప్రత్యేక పాపులారిటీ ని సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి చేసే అల్లరి మామూలు గా ఉండదు.

sreemukhi 3

బుల్లితెర రాములమ్మ గా స్టేజి పై నవ్వుల పువ్వుల కురిపించినా.. ఏ స్పెషల్ ఈవెంట్ లో అయినా తన టాలెంట్ తో సందడి చేసినా శ్రీముఖి రూటే సెపరేటు. బిగ్ బాస్ హౌస్ లో కూడా టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి కి ఇండస్ట్రీ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో అవినాష్ కూడా ఒకరు. అవినాష్ కూడా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోను కంటెస్టెంట్ గా ఆడాడు.

sreemukhi 2

తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ అప్పుడప్పుడు కామెడీ స్కిట్ లలో కూడా సందడి చేస్తూ కనిపిస్తారు. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ రీల్ లో శ్రీముఖి కార్తీకదీపం వంటలక్క గా సరదాగా నటించారు. ఆ సీరియల్ లో దీప ట్రీట్మెంట్ తీసుకోకపోతే.. ట్రీట్ మెంట్ తీసుకోవా అంటూ కార్తిక్ దీప చెంప పై కొడతాడన్న సంగతి తెలిసిందే.

sreemukhi 1

తాజాగా.. ఇదే సీన్ ను వీరు రిపీట్ చేసారు. అదే సీన్ లో వీరిద్దరూ నటిస్తూ ఆ రీల్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఆ వీడియో మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చింది. అవినాష్ కూడా శ్రీముఖి ని ట్రీట్మెంట్ తీసుకోవా? అంటూ చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. ఆ తరువాత ఆమె ఎమోషనల్ అయిపోయి హాగ్ ఇచ్చేసింది. ఈ ఎమోషన్స్ బాగా పండడం తో సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతోంది.