రెండుగంటల ప్రీ రిలీజ్ కి యాంకర్ సుమ ఎంత తీసుకుంటారంటే . .

రెండుగంటల ప్రీ రిలీజ్ కి యాంకర్ సుమ ఎంత తీసుకుంటారంటే . .

by Anudeep

Ads

రెండు దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టారు యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేస్తుంటుంది సుమ.  సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు.

Video Advertisement

అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తారు. ఒకరకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. సుమ ఈవెంట్ లో ఉందంటే చాలు దర్శక నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు రిలాక్స్ అయిపోవచ్చు. అంతా తానై చూసుకుంటుంది.

Also Read:  లేటు వయసులో పెళ్లి చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా.? ఈ యాంగిల్ లో ఎప్పుడు చూసుండరు.!

అందుకే ఆ మధ్య ఓ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. స్పాన్టనిటీ స్టార్ సుమ అని పొగిడారు. నాకు ఎంతోమంది ఫాన్స్ ఉండొచ్చు కానీ నేను మాత్రం సుమ ఫ్యాన్ నే అన్నారు మెగాస్టార్. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో టాప్ దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సుమతో యాంకరింగ్ అంటే మాములుగా ఉండదు. రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉంటుంది.

Also Read:   నంబర్ ప్లేట్స్ ఎందుకు అనేక రంగుల్లో ఉంటాయి.. వాటి అర్థం ఏంటో మీకు తెలుసా..!?

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం నాలుగు లక్షలకు తగ్గదట, తక్కువలో తక్కువ రెండు లక్షలు ఇస్తే కానీ ఈవెంట్ కి ఒప్పుకోదట. అంతేకాదు.. సుమ యాంకరింగ్ చేయాలంటే చాలానే కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ రెమ్యునరేషన్ ఫిక్స్ కావాలి.. అలాగని చివరి నిమిషంలో వచ్చి ఈవెంట్ చేయమంటే కుదరదు.. ఆమె డేట్స్ ముందే తీసుకోవాలి. కనీసం పది రోజులు ముందైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి. రెమ్యునరేషన్, కాల్ షీట్స్‌తో అయిపోలేదు. సుమ యాంకరింగ్ చేయాలంటే ఇంకో కో యాంకర్ తప్పకుండా ఉండాలి.

suma 1

 

 

ఈవెంట్ ఎన్ని గంటలైనా చేసుకోండి.. బట్ సుమ హోస్ట్ చేసేది మాత్రం రెండు గంటలే. ఇక ఈవెంట్‌కి తగ్గట్టుగా క్యాస్టూమ్స్.. మేకప్ ఇవన్నీ అదనం. స్పీచ్‌లు అన్నీ అవ్వాలి.. శుభం కార్డ్ సుమే వేయాలంటే అస్సలు కుదరదు. స్టేజ్ మీద చిరంజీవి ఉన్నా.. పవన్ కల్యాణ్ ఉన్నా, మహేష్ బాబు ఉన్నా.. ఎండింగ్ స్పీచ్ వరకూ అయితే అస్సలు ఉండదు.  వాళ్లు స్పీచ్‌లు అవుతున్నప్పుడే వెళ్లి కార్ ఎక్కేస్తుందట యాంకర్ సుమ.

ఎందుకలా అంటే.. తరువాత జనం అంతా ఒకేసారి బయటకు రావడం.. ట్రాఫిక్ సమస్యలు.. ఈ తిప్పలన్నీ పడలేకే ఈవెంట్ కాకుండానే ముందే వెళ్లిపోతుందట. మొన్న ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఇదే జరిగింది. మెగాస్టార్ చిరు స్పీచ్ కాకుండానే సుమ ఈవెంట్ నుంచి వెళ్లిపోయింది. చిరంజీవి స్పీచ్ ఇస్తున్న టైంలో సుమ గురించి ప్రస్తావిస్తూ.. సుమ ఏది? అని అడిగేశారు.. ఇంకెక్కడి సుమ.. అప్పటికే ఈవెంట్‌ను నుంచి వెళ్లిపోయారు.

Also Read:   “అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా..ఎలా ఉందో చూడండి..!


End of Article

You may also like