నంబర్ ప్లేట్స్ ఎందుకు అనేక రంగుల్లో ఉంటాయి.. వాటి అర్థం ఏంటో మీకు తెలుసా..!?

నంబర్ ప్లేట్స్ ఎందుకు అనేక రంగుల్లో ఉంటాయి.. వాటి అర్థం ఏంటో మీకు తెలుసా..!?

by Anudeep

Ads

మనం రోడ్డు మీద వెళుతున్నపుడు రకరకాల నెంబర్ ప్లేట్ చూస్తుంటాం.. అందులో అన్ని ఒకే రంగులో ఉండవు. అందులో మనకు తెలుపు, పసుపు వి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని కార్ల మీద అయితే లేత నీలం రంగు, ఆకుపచ్చ రంగులో ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి.

Video Advertisement

అయితే వివిధ రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లను ఎందుకు వినియోగిస్తున్నారు, వాటి అర్థం ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా..!? ఏ రంగు నెంబర్ ప్లేట్ అర్థం ఏమిటీ, ఎవరు వాడతారో చూద్దాం..

Also Read:  సినిమాలు శుక్రవారమే ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..!?

#1. తెలుపు రంగు:


తెలుపు రంగు ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే.. దీని అర్థం వీటిని వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి అని అర్థం. ఇతర వ్యాపార అవసరాలకు అంటే క్యాబ్ వంటి వాటికి, అద్దెకి ఇవ్వడం లాంటివి చేయకూడదు.

#2. పసుపు రంగు:


పసుపు రంగులో ఉన్న నెంబర్ ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేన్ నెంబర్ ఉంటే.. ఆ వాహనాలను అద్దె మరియు వ్యాపార అవసరలాకు వినియోగిస్తారు. ఇందులోకి ట్యాక్సీలు, క్యాబ్‌లు మరియు ట్రక్కులు వస్తాయి. ఇటువంటి వాహనాలకు డ్రైవింగ్ పర్మిట్ కూడా ఉంటుంది.

#3. నలుపు రంగు:


నలుపు రంగు ప్లేటు మీద పసుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే.. అటువంటి వాహనాలను వ్యక్తిగతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే అద్దె వాహనాలు అంటారు. వీటిని కమర్షియల్ యుటిలిటి వెహికల్స్ అంటారు.

#4. ఎరుపు రంగు:


రాష్ట్రపతి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గవర్నర్లు అలాగే ఇతర ఉన్నత ప్రభుత్వ అధికారుల కారు నెంబర్ ప్లేట్.. ఎరుపు రంగు ప్లేట్ మీద జాతీయ చిహ్నం ఉంటుంది.

#5. అక్షరాలు తెలుపు రంగులో:


తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఎరుపు లేదా తెలుపు రంగులో ఉండి వాటి మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. అంతేకాదు తాత్కాలికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆంగ్ల అక్షరం టిఆర్ తో ప్రారంభం అవుతాయి. వీటి తాత్కాలిక పరిమితి నెల రోజులు మాత్రమే. డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ మీద వాహనాలు అమ్మడానికి నిరాకరిస్తున్నారు. కేవలం శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే అమ్ముతున్నారు.

#6. పై వైపుకు సూచించే బాణం గుర్తు:


మిలిటరీ వాహనాల నెంబర్ ప్లేట్లు ఇతర వాహనాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. పై వైపుకు చూచించి ఉండే బాణపు గుర్తును ప్రారంభంలో ఉంటాయి. తరువాత ఉన్న రెండు అంకెలు కూడా దానిని కొనుగోలువ చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ప్రస్తుతం మిలిటరీ వాహనాలను డిఫెన్స్ మంత్రిత్వశాఖ విభాగం క్రింద రిజిస్ట్రేన్లు చేయిస్తారు.

#7. లేత నీలం రంగు:

ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు చేయించుకునే వాహనాలకు లేత నీలం రంగు బోర్డ్ మీద తెలుపు రంగులో అక్షరాలు ఉంటాయి. ఇటువంటి ప్లేటు మీద UN, CC, CD వంటి ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. అంటే వారు ఏ దేశాలకు చెందిన వారో ఇది సూచిస్తుంది. ఉదా: యుఎన్ అనగా యునైటెడ్ నేషన్స్ అంటారు.

 

Also Read:  “అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా..ఎలా ఉందో చూడండి..!


End of Article

You may also like