రియాలిటీ షో లకి ఈటీవీ కేర్ అఫ్ అడ్రస్.. అందులో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమానికి ఇప్పటికీ కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక రియాల్టీ షో కొనసాగడం అనేది మామూలు విషయం కాదు.

Video Advertisement

కేవలం సుమ యాంకరింగ్ అవ్వడం వల్లే కార్యక్రమం ఇంత కాలం కొనసాగుతుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమ ఉండడం వల్లే తాము క్యాష్ కార్యక్రమాన్ని చూస్తున్నాం అని మరి కొందరు వెల్లడిస్తున్నారు.

anchor suma remunaration for cash episode
యాంకర్లకు సుమ డిక్షనరీ లాంటిది. ఆమె మైక్ పట్టుకుందంటే మాటల ప్రవాహం.. పంచ్ వేసిందంటే నవ్వుల జల్లు కురవాల్సిందే. కొంతమంది యాంకర్లకు వాళ్లపై జోక్‌లు వేయకూడదు.. వీళ్లని అలా అనకూడదు అని లిమిట్స్ ఉంటాయి.. కానీ సీనియర్ సుమకి నో లిమిట్స్.. ఎదుట ఉన్నది మెగాస్టార్ అయినా.. సూపర్ స్టార్ అయినా తాను అనుకున్నది అనేస్తుంది. అయితే నొప్పించక తానొప్పక అన్నట్టుగా తన వాక్చాతుర్యంతో కట్టిపడేస్తుంటుంది యాంకర్ సుమ. ఎంతమంది యాంకర్లు ఉన్నాసరే టాలీవుడ్‌లో సుమది ప్రత్యేక స్థానం.. సుస్థిర స్థానం.

anchor suma remunaration for cash episode
ప్రతి వారం సెలబ్రిటీలను తీసుకు వచ్చి వారితో ఆటలు ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సుమ. ఈమె క్యాష్ కార్యక్రమం కోసం చాలా కష్టపడుతుంది. ఎన్నో డైలాగులను గుర్తు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టే ఈ షోకి ఈ స్థాయిలో రేటింగ్ రావడంతో పాటు ఇన్నాళ్లు కొనసాగుతోంది.

anchor suma remunaration for cash episode
ఇంతగా కష్టపడుతున్న సుమ క్యాష్ ఒక్క ఎపిసోడ్ కు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారని సమాచారం. ఐదు లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనం. అవి ఒక 50 వేల రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్ష ఎపిసోడ్ కు సుమ తీసుకుంటుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుమ క్యాష్ కార్యక్రమం మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 50 వేల నుండి 70 వేల రూపాయలు తీసుకొనేవారట. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎన్ని రెట్లు పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం.

anchor suma remunaration for cash episode
ఈటీవీలో క్యాష్ కార్యక్రమం కాకుండా ఆమె ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంతకు మించి తీసుకుంటారట. తనను యాంకర్ గా నిలబెట్టి ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది కనుక మల్లెమాల మరియు ఈటీవీ దగ్గర ఈ పారితోషికం తీసుకుంటారట. బయట చానెల్స్ లో సుమ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారని సమాచారం.

ఈటీవీ పై అభిమానంతో క్యాష్ కార్యక్రమం ఆమె రెగ్యులర్ గా చేస్తూనే ఉంటుంది. ఆమె చేయడం వల్ల ప్రేక్షకులు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. కనుక మరో 10 సంవత్సరాలు అయినా క్యాష్ కార్యక్రమం వస్తూనే ఉంటది.. ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. యాంకర్ గా సుమ కొనసాగుతూనే ఉంటుంది. సుమ ఎప్పుడైతే క్యాష్ కార్యక్రమాన్ని వదిలేస్తుందో అప్పటి వరకు మల్లెమాల, ఈటీవీ వారు క్యాష్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు అనేది బుల్లితెర వర్గాల టాక్.

anchor suma remunaration for cash episode
ఈటీవీలో సుమ యాంకరింగ్ చేసిన స్టార్ మహిళ కార్యక్రమం 11 ఏళ్ళు నిర్విరామం గా వచ్చింది. ఒకే వ్యాఖ్యాతతో ఎక్కువకాలం నిర్వహించబడిన కార్యక్రమంగా ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 3,181 భాగాలతో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ కార్యక్రమంగా స్టార్ మహిళ నిలిచింది.