క్వారంటైన్ పేరుతో మన వాళ్ళను కాల్చి చంపారు- చరిత్ర చెప్పని ఈ నిజం గురించి మీకు తెలుసా?

క్వారంటైన్ పేరుతో మన వాళ్ళను కాల్చి చంపారు- చరిత్ర చెప్పని ఈ నిజం గురించి మీకు తెలుసా?

by Megha Varna

Ads

క్వారంటైన్ ఈ పేరు ఇప్పుడు మనకు కామన్ అయిపోయింది. కానీ ఇదే పేరుతో 1915 లో మన దేశ ఖైదీలను దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్చి సముద్రంలో పడేసారు. వినడానికే బాధాకరమైన ఈ ఘటన 1915 లో జరిగింది.

Video Advertisement

అప్పట్లో మనదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన వారికి ద్వీపాంతర శిక్ష విధించేవారు. అప్పట్లో ఎక్కువగా అండమాన్ లో ఉన్న సెల్యులార్ జైలు కి పంపే వారు….అలా ఒకసారి మద్రాస్ నుండి ఓ నౌక ఇండియన్ ఖైదీలను తీసుకొని హిందూ మహా సముద్రం గుండా  అండమాన్ వెళుతున్న సందర్భంలో ….. ఆ నౌక లో ప్రయాణిస్తున్న ఒకరికి మసూచి సోకింది .. ఇది తెలుసుకున్న ఆ నౌక కెప్టెన్ అతన్ని , అతనితో పాటు ఉన్న ముగ్గుర్ని తన తుపాకీతో కాల్చి అదే సముద్రంలో పడేసాడు . అప్పట్లో మసూచికి చాలా భయపడే వారు.. వారి నుండి ఆ మసూచి ఇతరులకు సోకుతుందనే  కారణంతో ఆ కెప్టెన్ అలా చేసాడట.!

ఆ నౌక లో ఉన్న భారతీయ ఖైదీలు ఈ విషయాన్ని తప్పు పట్టినప్పటికి….. వారి అధికార బలం కింద అణగదొక్క బడ్డారు. అలా ఇండియా నుండి తీసుకొచ్చిన ఖైదీలను అండమాన్ జైలు లో బందించి అనేక రకాల చిత్రహింసలు పెట్టేవారట. VD సావర్కర్ ను కూడా శిక్ష పేరుతో ఈ జైలు కు పంపించారు. సావర్కర్ జైలు లో తన తోటి ఖైదీలను దేశ స్వతంత్రం వైపుగా చైతన్యవంతులను చేసాడు.


End of Article

You may also like