కొన్ని సార్లు ఒక సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కారణం గానే ఫెయిల్ అవుతూ ఉంటుంది. హీరో కి ఫాన్స్ ఉండడం సహజమే. వారు తమ హీరో ని ఓ రేంజ్ లో ఊహించేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సినిమా ఆ రేంజ్ ని బీట్ చేయలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంది. ఇందుకు ఉదాహరణే ఆంధ్రావాలా సినిమా. జూనియర్ ఎన్టీఆర్ చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

andhra vala

మొదటి సినిమా తోనే తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ” సింహాద్రి” సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తీసేటప్పటికీ ఎన్టీఆర్ ఏజ్ కేవలం ఇరవైయేళ్ళేనట. అప్పటికే, ఎన్టీఆర్ కి ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. దానితో, ఆ తరువాత రాబోయే ఎన్టీఆర్ సినిమా పైనా అభిమానులు ఎక్స్పెక్టషన్స్ పెంచేసుకున్నాడు. ఆ టైం లో ‘శివమణి’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా హిట్ లతో పూరి కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.

kannadiga

పూరి, ఎన్టీఆర్ కాంబో లో సినిమా అనగానే అంచనాలు బాగా పెరిగిపోయాయి. సింహాద్రి హిట్ తో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా మూడు రెట్లు పెరిగిపోయింది. ఈ క్రమం లో “ఆంధ్రావాలా” ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ ఓ రేంజ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. అలాగే, ఈ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తీరా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. మరో విశేషం ఏమిటంటే.. ఇదే స్టోరీ ని కన్నడ లో పునీత్ రాజ్ హీరో గా.. “వీర కన్నడిగ” పేరుతొ మెహర్ రమేష్ సినిమా తీశారు. ఇది మాత్రం సూపర్ హిట్ అయింది. “ఆంధ్ర వాలా” హిట్ టాక్ తెచ్చుకోక పోవడానికి కారణమేంటో మాత్రం ఇప్పటికీ అంతుపట్టదు.