యానిమల్ మూవీ 5 డేస్ కలెక్షన్స్… రికార్డు సృష్టించింది…!

యానిమల్ మూవీ 5 డేస్ కలెక్షన్స్… రికార్డు సృష్టించింది…!

by Mounika Singaluri

Ads

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో వసూలు నమోదు చేస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి తదితరులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది.

Video Advertisement

రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి 400 కోట్ల పైగా వసూలు సాధించి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు పెట్టింది. ఐదవ రోజు ఏ రేంజ్ కలెక్షన్స్ లో సాధించిందనే వివరాల్లోకి వెళితే…

యానిమల్ మూవీ హిందీ వర్షన్ కలెక్షన్లు తొలి రోజు 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండవ రోజు 58 కోట్ల రూపాయలు, మూడో రోజు 64 కోట్ల రూపాయలు, నాలుగవ రోజు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మొత్తంగా హిందీలోనే 247 కోట్ల రూపాయలు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే తొలి రోజు 8.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు, మూడవరోజు 7.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి 27 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది.

animal
ఇక ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో రికార్డ్ వసూలు నమోదు చేస్తుంది. తొలి రోజు 546,649 ఆస్ట్రేలియన్ డాలర్లు, రెండో రోజు 702,180 మూడో రోజు 701,751, నాలుగో రోజు 230,820 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఉత్తర అమెరికాలో 7 మిలియన్ డాలర్లు రాబట్టింది. అమెరికా ఆస్ట్రేలియా కెనడా గల్ఫ్ బ్రిటన్ తదితర దేశాల్లో కలిపి ఈ సినిమా 15 మిలియన్ డాలర్లు అంటే 133 కోట్ల రూపాయలు వసూలు సాధించింది.ఫుల్ రన్ పూర్తయ్యేసరికి యానిమల్ కలెక్షన్లు ఏ రేంజ్ కి చేరుకుంటాయో అంటూ సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read:యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్ ఆ స్టార్ హీరోది అని తెలుసా.? దాని ఖరీదు ఎంతంటే.?


End of Article

You may also like