“అనితా ఓ అనితా” సింగర్ నాగరాజు గుర్తున్నారా..? ఇప్పుడు అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా..?

“అనితా ఓ అనితా” సింగర్ నాగరాజు గుర్తున్నారా..? ఇప్పుడు అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా..?

by kavitha

Ads

‘అనితా ఓ అనిత’, ఈ పాట ఒకప్పుడు ఎంతగానో పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. ఈ తరం యూత్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90 దశకంలోని యూత్ కు ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 15 సంవత్సరాల క్రితం ఓ ఊపు ఊపిన పాట ఇది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరు పాడుకునేవారు.

Video Advertisement

ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించేది. ఎంతగా అంటే మూవీ సాంగ్స్ కన్నా ఎక్కువ ఈ పాటే వినిపించేది. అప్పట్లో ఈ పాట మాత్రమే కాదు. ఈ పాట వెనక ఉన్న ప్రేమ కథ కూడా ఆరోజుల్లో చాలా ఫేమస్ అయ్యింది. తన లవర్ తో బ్రేకప్ అయిన ప్రేమికుడి మనోవేదనే ఈ పాట. ఇక ఈ పాట రాసిన రచయిత పేరు నాగరాజు. అతను తన లవ్ స్టోరిని, విడిపోయిన బాధను ఇలా ఓ పాట రూపంలో తెలిపాడు. ఈ సాంగ్ తో నాగరాజు కూడా చాలా ఫేమస్ అయ్యాడు. Anitha-Song-Singer-Nagarajuఅంతగా పాపులర్ అయిన నాగరాజు సినిఇండస్ట్రీలో రాణిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అతడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. నాగరాజు గురించి అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..
Anitha-Song-Singer-Nagaraju2సింగర్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిత అనే యువతిని ప్రేమించానని, అయితే తమ వివాహానికి అనిత ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోయామని తెలిపాడు. ఆ బాధతోనే ‘అనిత ఓ అనిత’ పాటను రాశానని, ఈ సాంగ్ రాయడం కోసం నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. తాను ఆ పాట రాయడానికి ముందు ఆర్కేస్ట్రాలో గాయకుడిగా చేసేవాడినని అన్నారు. తాను రాసిన మొదటి పాట ‘అనిత’ సాంగ్ ను తానే పాడినట్లు తెలిపారు. Anitha-Song-Singer-Nagaraju3అప్పట్లో నేను మరణించానని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. అప్పుడు హైదరాబాద్‌ అంతా కొత్తగా అనిపించింది. దాంతో భయపడి మా ఊరికి వెళ్లిపోయాను. అనితకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు దేవిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి చెవిటి, మూగ. చిన్నబాబు కూడా పెద్దవాడిలానే సైగలే చేస్తాడని అన్నారు. కొంతకాలం పాటు పాన్‌షాపుతో నెట్టుకొచ్చానని, కళామతల్లి కాపాడుతుందని ఫ్యామిలీతో పాటు హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యామని తెలిపారు. ప్రస్తుతం తాను అనిత-2 పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Anitha-Song-Singer-Nagaraju1

Also Read: పుష్ప 2 : ‘వేర్ ఇస్ పుష్ప..??’ వీడియో ప్రచారానికి ఎంత ఖర్చయిందో తెలుసా..??


End of Article

You may also like