సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. ఇక రెండో పార్ట్ ‘పుష్ప2’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Video Advertisement

 

ఇక పుష్ప 2 అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ పుష్ప బృందం నుండి ఒక స్పెషల్ వీడియో వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు. ‘వేర్ ఇస్ పుష్ప..??’ అంటూ సాగే ఈ వీడియో లో జైలు నుండి పుష్ప పారిపోయినట్టు అతనికోసం అందరూ వెతుకుతున్నట్టు చూపించారు.

pushpa makers spend crores to 'where is pushpa..??' video..

పుష్ప చనిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పుష్ప చనిపోలేదు బతికే ఉన్నాడు అని, అది ఒక కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ఇందులో చూపించారు. అలా అల్లు అర్జున్ ఒక పులికి ఎదురు వెళ్తున్నట్టు ఈ వీడియో లో చూపిస్తూ హైలైట్ చేసారు మేకర్స్. అయితే పుష్ప 2 ని ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్న మేకర్స్ ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో శ్రద్ద తో తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది.

pushpa makers spend crores to 'where is pushpa..??' video..

తాజాగా వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ వీడియోని బాగా ప్రచారం చేయడానికి సుకుమార్ ఈ వీడియో కోసం కోట్లు ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్ టైం కి హైప్ ఉండేందుకు దర్శకుడు సుకుమార్ ఇప్పటి నుంచే ప్లాన్ చేశారట. ఈ సినిమా పబ్లిసిటీ కోసం అలాగే వీడియోలు వైరల్ అవ్వడం కోసం నిర్మాతలు దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు సమాచారం. దీంతో చిన్న టీజర్ కే ఇంత ఖర్చు చేసారంటే ముందు ముందు ఇంకెంత ఖర్చు చేస్తారో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.