మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ మూవీ మార్చ్ 22న ఉగాది కానుక రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా మరియు నిర్మితగా కూడా వ్యవహరించారు.

Video Advertisement

సుమారు ఇరవై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని విశ్వక్ సేన్ నిర్మించడం జరిగింది. ఇక విశ్వక్ కెరీర్ లో ఇదే అత్యధిక బడ్జెట్ సినిమా. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యి, హీరో విశ్వక్ సేన్ కు మరియు మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి ఈ సినిమా పై పడింది. ఉగాది నాడు సెలవు రోజు కావడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండడంతో ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోలు ఫుల్ అయ్యాయి. ఈ సినిమా విడుదల విషయంలో ఒక వింత ఘటన జరిగింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
dhamaka-instead-of-das-ka-dhamkiఒక థియేటర్ లో మాత్రం దాస్ క ధమ్కీ సినిమాకి బదులుగా ధమాకా సినిమాని వేశారు. దాస్ క ధమ్కీ చిత్రం చూడడానికి ధియేటర్ కి వెళ్తే అక్కడ మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ధమాకా’ మూవీని వేశారు. దాంతో ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపోయారు. ధమ్కి బదులు వేరే మూవీ ప్రదర్శిస్తున్నారని ఆడియెన్స్ కి అర్థం అవడంతో థియేటర్ లో గోల చేశారు. దాంతో తప్పుని గ్రహించిన థియేటర్‌ యాజమాన్యం వెంటనే `ధమ్కీ` సినిమాని ప్రదర్శించారు.
ఈ వింత ఘటన వైజాగ్ సుకన్య ధియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు, సటైర్స్ వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి దాస్ క ధమ్కీ మూవీకి బదులు ‘ధమాకా’ మూవీ డౌన్ లోడ్ చేసి ఉంటాడు. 2 సినిమాల ట్రైలర్లు మరియు టైటిల్స్ కూడా ఒకేలా ఉండటంతో ధియేటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని కామెంట్లు చేస్తున్నారు.
dhamaka-instead-of-das-ka-dhamki-2నెటిజెన్లు కామెడీ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇంకొందరు రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో పాపం అని కామెంట్స్  చేస్తున్నారు. రవితేజ నటించిన `ధమాకా` సినిమా గత సంవత్సరం విడుదలై, ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఈ ఇన్సిడెంట్ తో వైజాగ్ సుకన్య ధియేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.
dhamaka-instead-of-das-ka-dhamki-3Also Read: “హమ్మయ్య… మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యింది..!” అంటూ… కొరటాల శివ “NTR 30” సినిమా లాంచ్‌పై 15 మీమ్స్..!