కరోనా తరువాత గడిచిన గత కొన్ని నెలలుగా టికెట్ రేట్ల కారణంగా ప్రేక్షకులు చాలా వరకు థియేటర్ల ముఖం చూడాలంటే భయపడుతున్నారు. ఫ్యామిలీతో రావాలంటే జేబు గుల్లయిపోతోంది. ఇంటిలో నలుగురు సినిమాకు వెళితే టికెట్ రేట్లు స్నాక్స్ కలిసి రూ.2000 ఖర్చు చేయాల్సిన పరిస్తితి. ఈ భయం వల్లే సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

Video Advertisement

ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలకు బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లని పెంచారు. అయితే ఆ సినిమాలపై వున్న క్రేజ్ కారణంగా భారీగా టికెట్ ధరలు పెంచినా జనం పెద్దగా పట్టించుకోలేదు. యితే ఆ తరువాత వచ్చిన సినిమాలకు కూడా భారీగా టికెట్ రేట్లు పెంచడం జనాలకు పెద్దగా నచ్చలేదు. దీంతో చాలా వరకు సినిమాలని తిరస్కరించడం మొదలు పెట్టారు.

another problem for those two star hero's movies..!!

అయితే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం ఈ రెండు సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురుకావడం హాట్ టాపిక్ అవుతోంది. అంతే కాకుండా నైజాంలోని థియేటర్ల ఓనర్లు థియేటర్ల రెంట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

another problem for those two star hero's movies..!!

థియేటర్ల ఓనర్లు ఈ దిశగా అడుగులు వేస్తే ఆ ప్రభావం మొదట మైత్రీ నిర్మాతల సినిమాలపైనే పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల రెంట్లు పెరిగితే మాత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాలు కలెక్షన్ల విషయంలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మైత్రీ నిర్మాతలు నైజాంలో సొంతంగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధమైన సమయంలోనే థియేటర్ల రెంట్లు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే టికెట్ రేట్స్ పెరిగిన నేపథ్యం లో పలు సినిమాలు నష్టాలను చవి చూశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రెంట్ల పెంపు ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి.