“నా మాటలు మీరు నమ్మరు…అయినా చెప్తున్నాను” అంటూ…ఆన్సర్ షీట్ లో ఈ ఇంటర్ విద్యార్థిని ఏం రాసిందో తెలుసా?

“నా మాటలు మీరు నమ్మరు…అయినా చెప్తున్నాను” అంటూ…ఆన్సర్ షీట్ లో ఈ ఇంటర్ విద్యార్థిని ఏం రాసిందో తెలుసా?

by Harika

Ads

పవన్ కళ్యాణ్ సినిమా “తమ్ముడు” అందరూ చూసే ఉంటారు. అందులో లెక్చరర్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ తనకి పాస్ మార్కులు వేయించుకున్న సీన్ ఆ సినిమాకి హైలైట్. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతాయి అనుకుంటే పొరపాటే.నిజ జీవితంలో కూడా ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు.

Video Advertisement

తాజాగా బీహార్ లో ఒక విద్యార్థి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ రాస్తూ ఆన్సర్ షీట్ లో ఇలాగే ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేమిటో చూద్దాం. బీహార్ లో తాజాగా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫలితాల కోసం పేపర్ ఇన్విజిలేషన్ జరుగుతోంది. అయితే అక్కడ కొందరు ఇన్విజిలేటర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎందుకంటే ఆన్సర్ షీట్ లో ఆన్సర్స్ తో పాటు వాళ్ళ బాధలు, వాళ్ళ రిక్వెస్ట్ లు కూడా ఆన్సర్ షీట్స్ లో పొందుపరుస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫిజిక్స్ పేపర్ ఇన్విజిలేషన్ చేస్తున్న ఒక ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్ చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అందులో ఆ విద్యార్థి తను బాధలు చెబుతూ ఇలా రాశారు. నమస్కారం మేడం లేదా సార్.. నేను జ్యోతి, రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ కూడా అవ్వలేదు, నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. దయచేసి నన్ను పాస్ చేయండి.

నా మాటలు మీరు నమ్మరని తెలుసు అయినా చెప్తున్నాను. అని రాసింది దీంతో అవాక్వవ్వడం ఇన్విజిలేటర్ వంతయింది. మరికొందరు విద్యార్థులు తమను పాస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే మరి కొందరు మాత్రం తాము ఫెయిల్ అయిపోతే జరిగే నష్టాలని వివరిస్తున్నారు. చాలామంది ఇన్విజిలేటర్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యార్థుల వింత పోకడలకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో వున్నారు.


End of Article

You may also like