26 ఏళ్లుగా అమెరికాలోనే.. కానీ ఉన్నట్లుండి అనూహ్య నిర్ణయం.. తల్లి అయ్యిన తరువాతే ఇలా…? అసలు కారణం ఏంటంటే..?

26 ఏళ్లుగా అమెరికాలోనే.. కానీ ఉన్నట్లుండి అనూహ్య నిర్ణయం.. తల్లి అయ్యిన తరువాతే ఇలా…? అసలు కారణం ఏంటంటే..?

by Anudeep

Ads

ఆమె పేరు అనూ సెహగల్. గత 26 ఏళ్లుగా అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. మంచి కార్పొరేట్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. భారత్ కి దూరంగా ఉంటున్న ఆమె అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. దానికి కారణం ఆమె పిల్లలు. పదేళ్ల క్రితమే ఆమె తల్లి అయ్యింది.

Video Advertisement

అప్పుడే ఆ అనూహ్య నిర్ణయానికి నాందిపడింది. ఆమె తల్లి అయిన తొలి రోజుల్లో తన పిల్లలకు భారత సంస్కృతితో పాటు, దక్షిణాసియా సంస్కృతిని నేర్పించాలని భావించింది.

anu sehgal 1

ఆ ఆలోచనతో రూపొదిద్దుకున్నదే ‘ది కల్చర్ ట్రీ’ సంస్థ..! కార్పొరేట్ సంస్థలో భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలని కంకణం కట్టుకుంది. పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పిస్తే సరిపోదని.. వాటిపై వారికి పూర్తి అవగాహనా కల్పించాల్సిన అవసరం ఉందన్న సంగతి తనకి తల్లి అయ్యిన తరువాతే అర్థమైందని అను సెహగల్ చెబుతారు.

anu sehgal 2

పిల్లలకు వారి సాంస్కృతిక వైభవం గురించి తెలిస్తే.. వారిలో ఆత్మవిశ్వాసం పాళ్ళు పెరిగి పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారని అను విశ్వసిస్తారు. ఆమె తల్లి ముస్లిం, తండ్రి హిందూ. ఇలా ఆమె బాల్యం మీరట్ నగరంలో భిన్న సంస్కృతుల మధ్య నడిచింది. ప్రస్తుతం కల్చర్ ట్రీ సంస్థ ప్రారంభం అయ్యాక ఆమె భిన్న సంస్కృతులను, ముఖ్యంగా దక్షిణాసియా కల్చర్ ను మరింతగా స్టడీ చేస్తున్నారు. భిన్న సంస్కృతుల నుంచి వచ్చే పిల్లలకు అన్ని భాషలు, సంప్రదాయాల గురించి అవగాహనా కల్పించడం ప్రారంభించారు.

anu sehgal 3

ఆసియా ప్రజల పట్ల ఉన్న అనుమానాలను, అపోహలను దూరం చేయడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పిల్లల కోసం అనేక సాంస్కృతిక, భాషా, విద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొదటగా తన ఇద్దరు పిల్లల కోసమే అను ఈ పని ప్రారంభించారు. కానీ చాలా మంది పిల్లల తల్లితండ్రులు కూడా ఆసక్తి కనబరచడంతో కల్చర్ ట్రీ సంస్థ పరిధి పెరుగుతూ వచ్చింది. . 4 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కృష్ణ లీలల ఆధారంగా రూపొందించిన తోలు బొమ్మలాట ప్రోగ్రాం కూడా అమెరికాలో చాలా పాపులర్ అయింది.

anu sehgal 4

పిల్లల కోసం ఇండియా లో టూర్ కూడా వెయ్యాలని అను సిహగల్ అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అది కాస్త వాయిదా పడింది. మరోవైపు.. ఈ కార్యక్రమాలన్నిటిని అను సెహగల్ ఆన్ లైన్ వేదికగానే నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో పని చేసే టీచర్లకు కూడా ఆన్ లైన్ లోనే బోధన చేసేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇటీవలే మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్స్ వారు నిర్వహించే వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ కోసం “కల్చర్ ట్రీ” రూపొందించిన తోలు బొమ్మలాట ను ప్రదర్శించాలంటూ ఆహ్వానం అందడం విశేషం.


End of Article

You may also like