“అర్హత లేని సినిమాలు ఆస్కార్ కి వెళ్తున్నాయి..!” అంటూ… సంగీత దర్శకుడు “ఏఆర్ రెహమాన్” కామెంట్స్..! ఏం జరిగిందంటే

“అర్హత లేని సినిమాలు ఆస్కార్ కి వెళ్తున్నాయి..!” అంటూ… సంగీత దర్శకుడు “ఏఆర్ రెహమాన్” కామెంట్స్..! ఏం జరిగిందంటే

by Anudeep

ఇండియా నుంచి రెండు ఆస్కార్ లను ఒకేసారి అందుకొని రికార్డు సృష్టించాడు రెహమాన్. 2009 లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను రెహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టి ఒకేసారి అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంది. తొలి సారి భారత సినిమాకు ఆస్కార్ లభించడం తో యావత్ ఇండియన్ ఆడియన్స్ హుషారెత్తిపోతున్నారు.

Video Advertisement

‘నాటు నాటు’ సాంగ్ తో పాటు అందులోని లిరిక్స్, రాజమౌళి టేకింగ్, రామ్ చరణ్ ఎన్టీఆర్ డాన్స్ ఇవన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దీంతో ఈ పాటకు వరుసపెట్టి అంతర్జాతీయ అవార్డ్స్ రావడం, భారతీయుడి సత్తా ప్రపంచవ్యాప్తంగా మరోసారి రెపరెపలాడం వరుసగా జరిగిపోయాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో ఆదరణ పొందింది. పాపులారిటీ మాత్రమే కాదు ఆస్కార్ కి వెళ్లే అర్హత కూడా ఉండడంతో.. భారత్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపిస్తుంది అని అందరూ భావించారు.

AR rehman about oscars..!!

కానీ ఆర్ఆర్ఆర్ ని కాదని గుజరాతీ సినిమా లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. అయితే ఆ సినిమా ఆఖరి బరిలో స్థానం దక్కించుకోలేక వెనక్కి తిరిగి వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ ని ఎంపిక చేయకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఎ ఆర్ రెహమాన్ కూడా ఈ విషయాన్ని ఉద్దేశిస్తూనే ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు.

AR rehman about oscars..!!

మ్యూజిక్‌ లెజెండ్‌ రెహ్మాన్‌.. మరో ప్రముఖ సంగీత దిగ్గజం ఎల్‌ సుబ్రమణ్యంతో కలిసి సంగీతానికి సంబంధించిన ఒక చిట్ చాట్ చేసారు. ఈ నేపథ్యం లో ”మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. అర్హత లేని సినిమాలను పంపిస్తున్నారు అనిపిస్తుంది. బాధ అనిపిస్తున్నా, చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోతున్నాము. నేను కొన్ని సినిమాలు ఆస్కార్ కి వెళ్తే బావుండు అనుకుంటాను ” అంటూ రెహమాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రెహ్మాన్‌ ఈ వ్యాఖ్యలు రెండు నెలల క్రితమే చేశారు. కానీ ఇప్పుడు యాప్ట్ గా నిలుస్తున్నాయి.


You may also like