Ads
మనలో చాలామంది ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతుంటారు. నిద్రలేమి అనే ఈ సమస్య క్రమేపి డిప్రెషన్ కి దారితీస్తుంది. ఎక్కువ ఒత్తిడికి గురవడం వల్ల నిద్రలేమి కలుగుతుంది అనేది మనకు తెలిసిందే.
Video Advertisement
కానీ ఒత్తిడి అనేది ఒక మనిషికి కలగడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి చూడడానికి చాలా చిన్నవిగా ఉన్న వాటి పర్యవసానం మాత్రం చాలా భారీగా ఉంటుంది. పిల్లల పరీక్షల యొక్క టెన్షన్, పని ఒత్తిడి, ఇంటి గొడవలు మొదలైనవి అన్ని మనలో ఈ సమస్యను పెంచుతాయి.
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజులో కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత గందరగోళపు జీవనశైలి కారణంగా చాలామందికి నిద్ర కూడా పట్టని పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజంతా అలసటగా ఫీల్ అవుతాము. ఇది ఇలాగే కొనసాగితే క్రమేపి ఎన్నో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యను కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారానే మనం దూరం చేయగలుగుతాం. రోజు కంటినిండా నిద్రపోగలిగితే ఫ్రెష్ గా ,ఉత్సాహం గా ఉండడంతోపాటు మన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిద్ర అనేది రోజు మొత్తం మనం పడిన అలసటను పోగొట్టి మన బాడీకి ఉపశమనాన్ని కలిగించే ఒక ప్రకృతి ప్రక్రియ.
నిపుణుల అధ్యాయనం ప్రకారం ఒక మనిషి నిద్రించే వ్యవధి అనేది అతని వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువులు కనీసం రోజుకు 14 నుంచి 15 గంటల వరకు నిద్రపోవాలి. ఎదిగే పిల్లలు కు 12 నుంచి 14 గంటల వరకు నిద్ర చాలా అవసరం. అదే టీనేజర్లకు 10 నుంచి 12 గంటల విశ్రాంతి సరిపోగా, పెద్దల మాత్రం ఎనిమిది నుంచి పది గంటల వరకు నిద్రించడం అవసరం. అదే తిరిగి 60 ఏళ్లు దాటిన వాళ్ళు 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోతే చాలు.
మన చుట్టూ ఎంత హడావిడి ఉన్నా, పనులను క్రమబద్ధీకరించుకొని సమయానికి తిని పడుకోవడం మన రోజువారి రొటీన్ లో భాగంగా మార్చుకోవాలి. రాత్రిపూట భోజనం చేసిన తరువాత కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఇచ్చిన తరువాతే పడుకోవాలి. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నామని ప్రశాంతత లేదని కంప్లైంట్ చేస్తూ కనిపిస్తారు అలాంటివారు తమ బెడ్ రూమ్ నుంచి లాప్టాప్ లు ,టీవీలు ,మొబైల్ ఫోన్లు వంటివి తీసివేస్తే నిద్ర ఆటోమేటిక్గా అదే వస్తుంది.
End of Article