క్యాన్ వాటర్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమా..!!

క్యాన్ వాటర్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమా..!!

by Sunku Sravan

Ads

ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు 5 లీటర్ల నీరు తాగాలి. ఇలా చేస్తే రోగాలు దరిచేరవు. పూర్వకాలంలో మంచినీటి బావులు,చెరువులు, వాగులు అనేవి ఉండేవి. వాటి నుంచే నీరు తోడుకొని తెచ్చుకునేవారు. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే అందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండటం వల్ల ఆనాడు ఎవరికి కూడా రోగాలు అనేవి రాకుండా ఉండేది.

Video Advertisement

కానీ ప్రస్తుత కాలంలో ఆ నీటినే ప్యూరిఫైర్ పేరుతో రకరకాల బ్రాండ్స్ తో అమ్ముతున్నారు. మంచి నీటిలో కెమికల్ కలిపి స్వచ్ఛమైన నీరు పేరుతో మనకు అందిస్తున్నారు. ఆ నీటిని మనం తాగుతూ రక రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇంతకుముందు పట్టణాల్లో మాత్రమే క్యాన్ నీరు అనేది ఉండేది. కానీ ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నారు.

ప్యూరిఫైయర్ నీటితో వచ్చే ప్రాబ్లమ్స్:ఈ ఫిల్టర్ అయినా వాటర్ లో జీవం ఉండదని, ముఖ్యంగా మనకు వచ్చే బావి నీరే చాలా మంచిదని, దాన్ని కాస్త వడ కట్టుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నీరు తాగడం వల్ల ఎముకలు అరిగిపోయి, శరీరంలో లవణాల కొరత తగ్గిపోతుంది.

అంతేకాకుండా చర్మం పొడిబారిపోయి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కొందరికి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. శుద్ధిచేసిన నీరును రుచి కోసం అన్ని లవణాలను వదిలేస్తున్నామని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్ వాటర్, ఆర్వో వాటర్ ని సరఫరా చేయడం నిషేధించింది. అయినా జనాలు మాత్రం మారడం లేదని చెప్పవచ్చు.

 


End of Article

You may also like