వండిన అన్నాన్ని మళ్ళీ మళ్ళీ తింటున్నారా..? అయితే తప్పకుండ మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి…!

వండిన అన్నాన్ని మళ్ళీ మళ్ళీ తింటున్నారా..? అయితే తప్పకుండ మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి…!

by Megha Varna

Ads

చాలా మంది ఇళ్లల్లో ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని రాత్రి మళ్ళీ వేడి చేసుకుని తినడం లేదా రాత్రి వండిన అన్నాన్ని మళ్ళీ ఉదయం తినడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే మిగిలిపోయిన అన్నం తినడం మంచిదేనా…? ఆరోగ్యానికి దీని వల్ల ఏదైనా హాని కలుగుతుందా..? అనే దాని గురించి తెలుసుకుందాం.

Video Advertisement

తాజాగా జరిగిన రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే.. మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసింది. ముఖ్యంగా మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం అస్సలు తినకూడదు.

మిగిలిపోయిన అన్నం తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. మామూలుగా అన్నాన్ని వండేసి ఆ తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచిన అన్నం తినడం వల్ల బాక్టీరియా మీ శరీరం లోకి వెళుతుంది. ఈ కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు అన్నం ఉండకుండా చూసుకోండి. ఇలా ఉంచిన అన్నాన్ని అస్సలు తినకూడదు.

అన్నం వండిన గంట లేదా రెండు గంటల లోపు తినేయాలి. పైగా అన్నాన్ని వండేటప్పుడు బాగా ఉడికించి అప్పుడు మాత్రమే తినాలి. ఒకవేళ కనుక మీరు మళ్లీ అన్నాన్ని వాడుకోవాలి అంటే గది ఉష్ణోగ్రతలో కాకుండా దానిని ఫ్రిడ్జ్ లో ఉంచండి. అలా కనుక మీరు ఉంచారంటే దానిని మళ్ళీ తినొచ్చు.

పైగా ఒకసారి వండిన అన్నాన్ని పదే పదే వేడి చేయడం కూడా మంచిది కాదు. కేవలం ఒకసారి వండిన దాన్ని ఒకసారి మాత్రమే వేడి చేసుకుని తినాలి. కనుక అన్నం విషయంలో ఎప్పుడూ ఈ తప్పులు చేయొద్దు. ఈ ప్రకారం అనుసరించి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 


End of Article

You may also like