ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెల్యుట్ల వెనకున్న అర్థం తెలుసా? మూడు ఒకేలాగా ఉండవు..!

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెల్యుట్ల వెనకున్న అర్థం తెలుసా? మూడు ఒకేలాగా ఉండవు..!

by Mohana Priya

Ads

ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ అందరూ దేశానికి సైనిక దళాల కోవకి చెందిన వాళ్లే. కానీ ఎవరి ప్రత్యేకత వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా వారు చేసే సెల్యూట్ కూడా చూడడానికి ఒకేలా ఉన్నా ఆ దళాలకి ప్రత్యేకత ఉన్నట్టు వారి సెల్యూట్ కూడా ప్రతి రంగానికి వేరుగానే ఉంటాయి.

Video Advertisement

ఆర్మీ

ఆర్మీ వాళ్ళు చేయి ఎదుటి వాళ్లకు కనబడేలా పెట్టి, వేళ్ళన్ని దగ్గరగా ఉంచి మూడవ వేలు తమ కనుబొమ్మల కి కానీ, లేదా హ్యాట్ బ్యాండ్ కి కానీ తాకేలా పెడతారు. అది వాళ్ల మీద వాళ్ళకి ఉన్న నమ్మకాన్ని చూపించడమే కాకుండా, తమ లో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు అని తాము ఎలాంటి ఆయుధాలు దాచలేదు అని చెప్తున్నట్టు అర్థం.

నేవీ

చేయి 90 డిగ్రీల యాంగిల్ లో పెట్టి అరచేయి కిందకి చూపిస్తున్నట్టు ఉంటుంది వీరి సెల్యూట్. అలా పెట్టడం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఆ సేయిలర్స్ షిప్ లో పనిచేస్తున్నప్పుడు చేతికి నూనె లేదా గ్రీస్ అంటడం, లేదా దుమ్ము పట్టే అవకాశం ఉంటుంది. అవి కనిపించకుండా ఉండటానికి అరచేయి భూమివైపు పెడతారు.

ఎయిర్ ఫోర్స్

45 డిగ్రీల యాంగిల్ లో అరచేయి కుడి పక్కకి వచ్చేలా కుడి భుజం ముందుకు కనిపించేలా పెడతారు. వీళ్ళ సెల్యూట్ ఆర్మీ వాళ్ళ సెల్యూట్ కి నేవీ వాళ్ల సెల్యూట్ కి మధ్యలో ఉంటుంది. ముందు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సెల్యూట్ కూడా ఆర్మీ వాళ్ల సెల్యూట్ లానే ఉండేది. 2006లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కొత్త పద్ధతిలో సెల్యూట్ చేసే విధానాన్ని అమలు చేశారు.

ఇలా ఒక్కొక్క సైనిక దళానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు వారి సెల్యూట్ కి కూడా ప్రత్యేకత ఉంది.


End of Article

You may also like