“యూజ్ అండ్ త్రో చేస్తే ఫ్లాప్ అవ్వకపోతే ఇంకేం అవుతుంది..?” అంటూ… “ఫ్యామిలీ స్టార్” మీద సోషల్ మీడియా సెలబ్రిటీ కామెంట్స్..! ఎవరంటే..?

“యూజ్ అండ్ త్రో చేస్తే ఫ్లాప్ అవ్వకపోతే ఇంకేం అవుతుంది..?” అంటూ… “ఫ్యామిలీ స్టార్” మీద సోషల్ మీడియా సెలబ్రిటీ కామెంట్స్..! ఎవరంటే..?

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలని సినిమా అందుకోలేకపోయింది. టెక్నికల్ గా సినిమా బాగున్నా కూడా రైటింగ్ పరంగా సినిమాలో లోపాలు ఉండడంతో కథ అంత పెద్దగా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. అందులోనూ మిడిల్ క్లాస్ పేరుతో చూపించిన కొన్ని సీన్స్ ప్రేక్షకులకు అంత పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు. ఎడిటింగ్ విషయంలో కూడా చాలా పొరపాట్లు జరిగినట్టు అనిపించాయి.

Video Advertisement

family star review telugu

ఇవన్నీ కూడా రైటింగ్ వల్ల జరిగిన లోపం వల్ల మాత్రమే జరిగాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరీ రియాలిటీకి దూరంగా రాసుకున్నారు అని అన్నారు. కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం తనని సెలెక్ట్ చేసి, సరైన సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు తీరా చూస్తే సినిమాలో తన సీన్ తీసేశారు అని ఒక సోషల్ మీడియా స్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేసినందుకు సినిమా ఫ్లాప్ అవ్వకుండా ఇంకేం అవుతుంది అని అన్నారు. ఆశ బొర్రా.

asha borra comments about her role in family star

టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి, ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఇంకా ఫేమస్ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో తనకి ఒక పాత్ర ఇచ్చారు. షూటింగ్ సమయంలో ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా మందులు వాడి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు ఆశ. “జర్నీ ఆఫ్ ఎ హౌస్ వైఫ్, ఫ్రమ్ కిచెన్ టు సిల్వర్ స్క్రీన్” అంటూ ఒక పోస్ట్ షేర్ చేసి, అందులో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేశారు. “నాలాంటి దాన్ని పిలిచి మరి స్వెప్ట్ అవుట్ స్టఫ్ లాగా యూజ్ అండ్ త్రో చేస్తే సినిమా అట్టర్ ప్లాప్ కాకపోతే ఇంకేం అవుతుంది.”

“కంగ్రాట్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీ స్టార్. సీన్లు, సాంగ్లు, ఫ్యామిలీ ఫంక్షన్లు ఇంటరాక్షన్లు, అబ్బబ్బ వాట్ నాట్ ఇన్ దిస్ మూవీ. అన్నిట్లో నేనేగా. థాంక్స్ ఫర్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు అండ్ టీం” అంటూ రాసుకొచ్చారు ఆశ. “రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ప్రయాణ ఖర్చులకి డబ్బులు ఇవ్వలేదు. హోటల్లో ఉండడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు” అంటూ రాశారు. విజయ్ దేవరకొండతో తనకి ఉన్న మాట్లాడే సీన్ ఉంచినా కూడా కాస్త సాటిస్ఫాక్షన్ ఉండేదేమో అని అన్నారు.

ALSO READ : “పుష్ప” తో పాటు… “అల్లు అర్జున్” ని ఐకాన్ స్టార్ చేసిన 13 సూపర్ హిట్ సినిమాలు..!


End of Article

You may also like