ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ ప్రశ్నలు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది..!

ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ ప్రశ్నలు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది..!

by Megha Varna

Ads

మనం పిల్లలకి నేర్పే ప్రతిదీ కూడా వాళ్ల భవిష్యత్తు పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పాలి. మంచినే అనుసరించమని చెప్తూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది.

Video Advertisement

కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలకి మంచి అలవాటు అయ్యేటట్టు చేయాలి. ముఖ్యంగా ఆడ పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని విషయాలని చెప్తూ ఉండాలి.

అయితే మీ పిల్లలు నమ్మకాన్ని కూడా పెంపొందించాలి మీకు కనక ఆడపిల్ల ఉన్నట్లయితే వాళ్ళలో నమ్మకాన్ని పెంపొందించడానికి ఈ ప్రశ్నలు వేయండి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆడపిల్లలకి ఎస్టీమ్ లెవెల్స్ పెంచేలా చేయాలి.

నువ్వు బాగా గర్వ పడే విషయాలను ఏం పొందావు అని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నించాలి. దాంతో వాళ్ళకి ఏదైనా సాధించాలని ఉంటుంది.

మిగిలిన వారితో పోల్చుకుంటే నువ్వు ఎందులో స్పెషల్ అని ప్రశ్నించండి. అప్పుడు వాళ్లు ప్రత్యేకంగా కొన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు.

ఎప్పుడు నువ్వు ఎక్కువ ధైర్యం తో ఉంటావు అని కూడా ప్రయత్నించాలి. ఇది కూడా వాళ్ళల్లో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఎస్టీమ్ లెవల్స్ ను పెంచుతుంది.


ఇతరులకి నువ్వేం నేర్పగలవు అనేది కూడా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్న కూడా వాళ్ళు ఎందులోనైనా చక్కటి నైపుణ్యం కలిగి ఉండాలి అని తెలుపుతుంది. ఏదైనా సాధించాలని ఉంటుంది.
నీలో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దేనిని ఇంప్రూవ్ చేసుకుంటావు. ఈ ప్రశ్న కూడా వేయండి. ఇది కూడా మంచి ప్రశ్న.

నీ గురించి నువ్వు చెప్పే ఐదు పదాలు ఏవి. ఇది కూడా చక్కటి ప్రశ్న. దీనితో వాళ్ళకి వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇలా తల్లిదండ్రులు పిల్లల్ని ఈ విధంగా ప్రశ్నిస్తే పిల్లలు కూడా వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. బంగారు భవిష్యత్తుని పొందడానికి తపన పడుతూ ఉంటారు. మంచి చెడు తెలుసుకుని చక్కటి దారి లో వెళుతూ ఉంటారు.


End of Article

You may also like