Ads
‘అట్ల తద్ది’ పండుగను అశ్వీయుజ మాసంలో తదియ తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజు అట్లతద్ది నోము చేసుకుంటే ఎంతో మంచి కలుగుతుంది. ఉదయాన్నే అన్నం తిని, తమలపాకు చెక్క వేసుకుని, ఉయ్యాల ఊగుతూ ఆనందంగా చేసుకునే నోము ఇది.
Video Advertisement
గోరింటాకులు పెట్టుకుంటారు ఆడపిల్లలు, స్త్రీలు కూడా. ఆ తరవాత రాత్రి దాకా ఉపవాసం ఉండి. చంద్రుడికి పూజ చేసుకుని, కధ చదువుకుని అక్షింతలు వేసుకుని 11 అట్లను ఇస్తారు.
అట్లతద్ది నోము కధ:
పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు.
పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అటు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండు తిని సేదతీరి పూజ చేసుకో అన్నాడు.
రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు పోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది -అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిధిగానే చేసింది.
కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. దీనితో ఆమెకి ముసలిభర్త వస్తాడు. అందరికీ మంచి భర్త వస్తాడు. దీనితో రాజకుమార్తె దిగులు చెంది అందరికీ మంచి భర్త వచ్చారు నాకేమి ఇలా జరిగిందని అడుగుతుంది.
అప్పుడు రాజకుమార్తెతో జరిగింది చెబుతారు స్నేహితురాళ్ళు. అప్పుడు రాజకుమార్తె చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ అట్లతద్దికి చంద్రుడు వచ్చే దాకా ఎదురుచూసి అపుడు ఫలహారం తింటుంది. అట్లతద్ది నోము చేసే ఆడపిల్లలకి మంచి భర్త వస్తారట. అందుకని ఆడపిల్లలు నోచుకుంటారు. వివాహం అయిన వారు చేస్తే సంపద కలిగి ఆనందంగా ఉంటారట.
End of Article