జవాన్‌ను ఆస్కార్‌కు పంపస్తామని డైరెక్టర్ అట్లీ కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..!

జవాన్‌ను ఆస్కార్‌కు పంపస్తామని డైరెక్టర్ అట్లీ కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..!

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన మూవీ జవాన్. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అప్రతిహతంగా దూసుకెళ్తోంది. దిగ్విజయంగా రూ.800 కోట్లు దాటి, వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపుకు పరుగులు పెడుతోంది.

Video Advertisement

వరసగా వచ్చిన సెలవులను వాడుకున్న జవాన్ థియేటర్లలో మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. ప్రధాన కేంద్రాల్లో అయితే రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఇప్పుడే చూస్తున్నామని బాలీవుడ్ బయ్యర్లు అంటున్నారు. తాజాగా ఈ మూవీ దర్శకుడు అట్లీ చేసిన కామెంట్లుతో అతని పై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విజయంతో అట్లీ సంతోషంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే అట్లీ తన మూవీ జవాన్ ను ఆస్కార్ బరిలో దింపాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం గురించి దర్శకుడు అట్లీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.
అట్లీ మాట్లాడుతూ, ఏ దర్శకులకు అయినా అవార్డుల పైన ఆశ ఉంటుందని అన్నారు. జాతీయ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ వంటివాటిని అందుకోవాలని కలలు కంటారని అన్నారు. అన్నీ కరెక్ట్ గా సెట్ అయితే, జవాన్ మూవీని ఆస్కార్ బరిలో నిలబెట్టాలని భావిస్తున్నామని, ఈ విషయం గురించి షారుఖ్ సర్‌ని అడగాలని, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని అట్లీ చెప్పుకొచ్చారు.
అయితే అట్లీ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్లు అట్లీని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.  కొందరు నెటిజెన్లు అన్నీ సినిమాలను కలిపి తీసావు. ఏ విభాగంలో ఆస్కార్ ఇవ్వమని అంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు  మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్‌ వంటి మూవీ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారా? అని, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జవాన్ మూవీని  సౌత్‌ లో ఆదరించక పోయినా, బాలీవుడ్ లో ఈ మూవీని విపరీతంగా చూస్తున్నారు. దాంతో బాలీవుడ్‌లో అతిపెద్ద రికార్డులను సృష్టిస్తోంది.

Also Read: హీరో అక్కినేని నాగార్జున సోదరి.. హీరో సుశాంత్ తల్లి నాగసుశీల పై కేసు..

 


End of Article

You may also like